logo

రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి

రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు

Published : 29 Mar 2024 05:26 IST

పలువురు నేతలతోనారా లోకేశ్‌ సమీక్ష

 

 నారా లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎస్‌ఎండీ ముస్తాక్‌ హుస్సేన్‌

ఈనాడు, కడప : రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు. మరో మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డితోనూ చర్చించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మైనార్టీ నేతలకు ప్రాధాన్యమిచ్చే దిశగా ఆ వర్గానికి చెందిన నేతలను లోకేశ్‌ హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడారు. వీరిలో తెదేపా సీనియర్‌ నేత దాదా సాహెబ్‌ కుమారుడు ఎస్‌ఎండీ ముస్తాక్‌ హుస్సేన్‌తో ప్రత్యేకంగా చర్చించారు. పార్టీలో మైనార్టీ నేతలకు ఉన్న అవకాశాలు వివరించారు. భవిష్యత్తులో పార్టీ ద్వారా కలిగే అవకాశాలు, పునర్విభజనతో నియోజకవర్గాల పెంపు తదితర అంశాలు వివరించారు. ఎన్టీఆర్‌ హయాం నుంచి మా కుటుంబం, బంధువులు తెదేపాలోనే ఉన్నారని, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ముస్తాక్‌ హుస్సేన్‌ వివరించారు. తెదేపా అభ్యర్థి గెలుపు బాధ్యతలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి ప్రసాద్‌బాబుతో మదనపల్లెలో చంద్రబాబు బుధవారం రాత్రి సమావేశమయ్యారు. మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని గెలిపించే బాధ్యత తీసుకోవాలని ఆయనకు సూచించారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని