logo

ఇదేం సన్నద్ధత

ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని గత మూడు నెలలుగా తితిదే అధికారులు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Published : 18 Apr 2024 03:57 IST

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని గత మూడు నెలలుగా తితిదే అధికారులు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని వసతులు కల్పిస్తామని గొప్పగా ప్రకటిస్తున్నారు. ఆచరణలో మాత్రం చతికిలపడుతున్నారు.  కడుపారా భోజనం చేయాలని వచ్చిన సందర్శకులకు నిరీక్షణ ఓ పరీక్షగా మారింది. భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకొని ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రతి ఏటా ఉత్సవాల సమయంలో ప్రైవేటు వ్యక్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి  భోజనం పెట్టేవారు. ఈ ఏడాది  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.  రాజకీయం చేస్తారని భావనతో ఇతరులకు అనుమతి ఇవ్వలేదు. తితిదే తరఫున అన్నదానం కేంద్రం వద్ద సరిగా ఏర్పాట్లు చేయలేదు. దీంతో పళ్లెం దొరకాలంటే చాలాసేపు క్యూలైనులో నిలబడాల్సి వచ్చింది.  రాత్రి పూట ఒకే చోట భోజనం పెట్టడంతో తోపులాట చోటుచేసుకుంది. బ్రహ్మోత్సవాలకు సన్నద్ధమంటే ఇదేనా భక్తులు ఆక్రోశించారు. ఇక్కడ పోలీసులు, తితిదే భద్రతా సిబ్బంది కూడా పెద్దగా కనిపించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని