logo

రాజంపేట వైకాపాలో ముసలం

రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్‌ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.

Published : 19 Apr 2024 02:58 IST

దేపాలో చేరిన వైకాపా కౌన్సిలర్లు, సర్పంచులు

తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో పార్టీలో చేరిన వైకాపా కౌన్సిలర్లు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్‌ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు. దీంతో వైకాపాకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో గురువారం రాజంపేట పురపాలక వైకాపా కౌన్సిలర్లు పసుపులేటి సుధాకర్‌, మనుబోలు వెంకటసుబ్బయ్య, మురళి ఆచారి, నాయక్‌లు చేరారు. వీరితో పాటు నందలూరు మండలం మాజీ ఎంపీపీ భువన లక్ష్మీనరసయ్య, టంగటూరు సర్పంచి పెంచలయ్య, నాగిరెడ్డిపల్లి సర్పంచ్‌ సూర్యనారాయణ, వార్డు సభ్యులు నాగేంద్ర, జిల్లా వక్ఫ్‌ బోర్డు కార్యదర్శి అమీర్‌, మాజీ మార్కెట్‌ యార్డు కమిటీ డైరెక్టర్‌ మట్టిబాబు, రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గుల్జార్‌బాషా, గుండ్లూరు మాజీ సర్పంచి ముమ్మడి మదన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురు వైకాపా నేతలు తెదేపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని