icon icon icon
icon icon icon

చేజారిన సీఎం పదవి

పట్లోళ్ల రామచంద్రారెడ్డిది కొండాపూర్‌ మండలం మారేపల్లి. పట్లోళ్ల లక్ష్మారెడ్డి, వీరమ్మల మూడో సంతానం.

Published : 15 Nov 2023 13:32 IST

న్యాయవాదిగా రాజకీయాల్లోకి..

పి.రామచంద్రారెడ్డి

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, కొండాపూర్‌: పట్లోళ్ల రామచంద్రారెడ్డిది కొండాపూర్‌ మండలం మారేపల్లి. పట్లోళ్ల లక్ష్మారెడ్డి, వీరమ్మల మూడో సంతానం. న్యాయవాది వృత్తి చేపట్టిన ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారు. 1959లో పటాన్‌చెరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా, ఏపీఎస్‌ ఆర్టీసీ పాలకవర్గ సభ్యుడిగా పని చేశారు. 1962, 1972, 1983, 1985, 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

స్పీకర్‌గా ఉన్న సమయంలో..

1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక 1990 జనవరి 4న శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. అదే ఏడాది ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం కల్పించనున్నారని జోరుగా ప్రచారం సాగింది. నిస్వార్థ నేతగా పేరుండగా, న్యాయవాది కూడా కావడంతో ఆయనకు పదవి ఖాయమని అంతా భావించారు. తీరా పార్టీ అధిష్ఠానం సీల్డ్‌ కవర్‌లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పేరు పంపడంతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. నేదురుమల్లి మంత్రివర్గంలో ఆయనకు భారీ పరిశ్రమల శాఖ బాధ్యతను అప్పగించారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖనూ అప్పగించారు. కానీ అది రెండు నెలలకే పరిమితమైంది. సాక్షాత్తు సీఎం పేషీ నుంచి వచ్చిన దస్త్రాన్ని రామచంద్రారెడ్డి వెనక్కి పంపడమే కారణమని చెబుతారు.

మారేపల్లిలో రామచంద్రారెడ్డి స్వగృహం

సొంతూరికి ‘తొలి’ ప్రాధాన్యం

స్వగ్రామమైన మారేపల్లికి నియోజకవర్గంలోనే తొలిసారిగా విద్యుత్తు వసతి కల్పించారు. పూరిళ్లు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు 9 ఎకరాల విస్తీర్ణంలో ప్రణాళికతో కూడిన ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. తల్లి వీరమ్మ స్మారకార్థం ఆయుర్వేద ఆసుపత్రిని నిర్మించారు. ఇలా నిక్కచ్చి ఉన్న వ్యక్తిగా పేరొంది నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img