Andhra News: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ వార్తలపై స్పందించిన మంత్రి బొత్స

ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ అయిందన్న వార్తలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

Updated : 29 Apr 2022 06:09 IST

అమరావతి: ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ అయిందన్న వార్తలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రశ్నాపత్రం లీక్‌, కాపీ అనేది అవాస్తమని పేర్కొన్నారు. ఉదయం 9.30కు ముందు పేపర్‌ బయటకు వస్తే లీక్‌గా భావిస్తారని, నంద్యాల జిల్లాలో పేపర్‌ లీక్‌ అంటూ కుట్ర చేశారని బొత్స తెలిపారు. కుట్రకు కారకులు, టీచర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించేందుకు కుట్రలు పన్నినట్లు మంత్రి ఆరోపించారు. దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని బొత్స వాపోయారు. విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేయడం సమంజసమా? అని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం లీక్‌ అయినట్లు వస్తున్న పుకార్లను నమ్మొద్దని విద్యార్థులకు మంత్రి సూచించారు. తప్పు జరిగితే ఒప్పుకుంటాం, సరిదిద్దుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వార్డ్‌ బాయ్‌గా తొమ్మిదో తరగతి విద్యార్థిని పెట్టడం తప్పేనని ఒప్పుకున్నారు. ఈ ఘటనలో సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు