Ukraine crisis: ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు సాయం చేయండి: విదేశాంగ మంత్రికి జగన్‌ లేఖ

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో

Published : 24 Feb 2022 01:34 IST

అమరావతి: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జగన్‌ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సైతం ఉక్రెయిన్‌లో ఉన్నారని.. వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని కేంద్ర మంత్రిని జగన్‌ కోరారు. ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీని ఏపీ విద్యార్థులు సంప్రదించాలని జగన్‌ సూచించారు. ఏపీ ప్రభుత్వం సైతం ఏపీ విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతూ అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు కృషి చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని