Andhra News: రేపటి నుంచే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ: మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బదిలీలు పూర్తి అయిన తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
పదోన్నతులు, బదిలీల గురించి భేటీలో చర్చించినట్లు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా బదిలీలు చేపట్టనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. 675 ఎంఈఓ-2 పోస్టులకు సంబంధించి రేపు జీఓ జారీ చేయనున్నట్లు చెప్పారు. 350 మంది గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులు, 9,269 మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. 1,746 మంది పీజీ ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియను రేపటినుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. కోర్టులకు వెళ్లి ప్రక్రియను అడ్డుకోవద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.