Andhra news: పేరుకే మూడు రాజధానులు.. పాలనంతా విశాఖ నుంచే: ధర్మాన

పేరుకు మూడు రాజధానులు అని చెప్పినా.. పాలన అంతా విశాఖ నుంచే సాగుతుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇన్నేళ్ల తర్వాత విశాఖపట్నానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ప్రజలకు సూచించారు.

Updated : 31 Oct 2022 19:09 IST

శ్రీకాకుళం: పేరుకు మూడు రాజధానులు అని చెప్పినా.. పాలన అంతా విశాఖ నుంచే సాగుతుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇన్నేళ్ల తర్వాత విశాఖపట్నానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ప్రజలకు సూచించారు. ‘మన విశాఖ..మన రాజధాని’ పేరిట శ్రీకాకుళంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ధర్మాన పాల్గొన్నారు. అమరావతిలో 33 వేల ఎకరాలు సేకరించిన చంద్రబాబు..రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అంగీకరించలేదనే తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. విశాఖ రాజధానిపై ప్రజల్లో చలనం తీసురావాలనే ఉద్దేశంతోనే ‘రాజీనామా’ అన్నానని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని