Andhra News: అమరావతి సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు

ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రేపటిలోగా ప్రస్తుతం ఉద్యోగులు

Published : 29 Jun 2022 17:55 IST

అమరావతి: ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రేపటిలోగా ప్రస్తుతం ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలని సాధారణ పరిపాలనాశాఖ ఆదేశించింది. ఖాళీ చేసిన ఫ్లాట్లను మంచి స్థితిలో అప్పగించాలని స్పష్టం చేసింది. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యతని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి ఉచిత వసతి కల్పిస్తూ వచ్చింది. తాజాగా ఉచిత వసతిని రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు