Polavaram: పోలవరం తొలిదశ మిగిలిన పనులకు అదనంగా రూ.12,911 కోట్లు!

పోలవరం నిర్మాణంపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు ఈ మేరకు లిఖితపూర్వక జవాబిచ్చారు.

Published : 24 Jul 2023 18:43 IST

దిల్లీ: పోలవరం నిర్మాణంపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు ఈ మేరకు లిఖితపూర్వక జవాబిచ్చారు.  ‘‘పోలవరం తొలి దశలో 41.15 మీటర్ల నిర్మాణం పూర్తికి ఏపీ ప్రభుత్వం నిధులు కోరింది. ఇందుకోసం రూ.17,144 కోట్లు ఖర్చువుతుందని చెప్పింది. 2024 జూన్‌ నాటికి ప్రాజెక్టు నిర్మించాలని తొలుత నిర్ణయించాం. 2020, 2022లో వరదల వల్ల నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి’’ అని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందనేది మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం.

మరోవైపు, పోలవరం తొలిదశ నిర్మాణానికి మిగిలిన పనుల కోసం అదనంగా రూ.12,911 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వైకాపా పార్లమెంటరీ నేత అడిగిన ప్రశ్నకు.. రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నిధుల విడుదలకు అభ్యంతరం లేదని ఆర్థికశాఖ తెలిపినట్లు వివరించింది. ఈ మేరకు పోలవరం నిధులపై గత నిర్ణయాన్ని సవరిస్తూ మంత్రివర్గం తాజా ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. అయితే, ఈ తాజా ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని