Chaganti Koteswara Rao: తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి

తితిదే పదవిని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు. సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Updated : 04 Mar 2023 21:08 IST

తిరుమల: ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తితిదే ధర్మ ప్రచార పరిషత్‌ (TTD) సలహాదారు పదవిని తిరస్కరించారు. తితిదేకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అక్కర్లేదని ఆయన అన్నారు. ‘‘తితిదేకి నా సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా తప్పకుండా ఇస్తాను’’ అని చాగంటి వ్యాఖ్యానించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జనవరి 20న ధార్మిక పరిషత్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తితిదే ధార్మిక సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే,  చాగంటి పదవిని తిరస్కరించిన అంశానికి సంబంధించి తితిదే నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని