Fancy number: బండి ధర ₹71 వేలు.. ఫ్యాన్సీ నంబర్‌కి ₹15 లక్షలు!

మార్కెట్లో ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.

Published : 21 Apr 2022 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మార్కెట్లో ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఖరీదైన కార్లు, బైకులకు తోడు ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్‌ ఉంటే ఆ కిక్కే వేరంటారు వాహన ప్రియులు. తాజాగా హరియాణా రాష్ట్రం చండీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారి తనకు నచ్చిన వీఐపీ నంబరు కోసం ఏకంగా రూ. 15లక్షలు చెల్లించాడు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి సాధారణమే కదా ఇందులో వింతేముంది అంటారా? అతను ఖరీదు చేసింది ఏ బెంజ్‌ కారు కోసమో కాదు. తన హోండా యాక్టీవా స్కూటర్‌ కోసం. దీని ధర రూ. 71 వేలు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టుగా ఇదెక్కడి పిచ్చిరా నాయనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఫ్యాన్సీ నంబర్లను అమ్మకానికి ఉంచడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడి రవాణా అధికారులు 0001 అనే సంఖ్యతో పూర్తయ్యే నంబరును రూ. 5లక్షలకు వేలానికి ఉంచారు. దీనికోసం ఎంతో మంది పోటీ పడగా బ్రిజ్‌ మోహన్‌ అనే  వ్యాపారి రూ. 15.44లక్షలకు దక్కించుకున్నాడు. ఈ వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5కోట్ల అదనపు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని