CM KCR: మునుగోడులో ఇచ్చిన హామీల అమలు మొదలుపెట్టండి: సీఎం కేసీఆర్‌

మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ మొదలు పెట్టాలని పార్టీ నేతలకు తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అధికారులతో సమన్వయం చేసుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి ఆయన సూచించారు.

Published : 08 Nov 2022 01:27 IST

హైదరాబాద్‌: మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ మొదలు పెట్టాలని పార్టీ నేతలకు తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అధికారులతో సమన్వయం చేసుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి జగదీశ్‌ రెడ్డికి సూచించారు. తెరాసపై నమ్మకంతోనే ప్రజలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని సీఎం అన్నారు. మునుగోడులో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. మునుగోడు ఉపఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చి గెలిపించినందుకు సీఎంకు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. తెరాస గెలుపు కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను అభినందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని