
Published : 27 Jan 2022 17:09 IST
TS News: మహేశ్ బ్యాంక్‌లో హ్యాకింగ్.. కారణం చెప్పిన హైదరాబాద్ సీపీ
హైదరాబాద్: మహేశ్ బ్యాంక్‌లో హ్యాకింగ్ జరగడానికి బ్యాంక్ సర్వర్‌లో లోపమే కారణమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. హ్యాకింగ్‌కు గురైన రూ.12.9కోట్లు పలు ఖాతాలకు బదిలీ అయ్యాయని.. అందులో రూ.3కోట్ల వరకు నిలుపుదల చేశామని చెప్పారు. కేసు దర్యాప్తులో మహేశ్ బ్యాంక్‌కు సంబంధించిన మూడు ఖాతాల నుంచి దేశంలోనే 120 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లు సీపీ వివరించారు. ప్రజల ఖాతాలతో వ్యవస్థ నడిపినపుడు సరైన భద్రత కల్పించడం బ్యాంక్ కనీస బాధ్యతని.. నిర్లక్ష్యంగా వహించినందుకు బ్యాంకుపైనా కేసు నమోదు చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు.
Tags :