ఆస్తుల నమోదులో నిర్లక్ష్యం..సిబ్బందికి నోటీసులు

హైదరాబాద్‌ పరిధిలోని రెవెన్యూ అధికారులపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 27 Feb 2024 18:53 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పరిధిలోని రెవెన్యూ అధికారులపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆయన ఆసహనం వ్యక్తం చేశారు. ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదును నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ స్థాయి అధికారులైనా విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.

11 మంది సిబ్బందికి నోటీసులు..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆస్తుల నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేశారని 11 మంది సిబ్బందికి నోటీసులు జారీ అయ్యాయి. హైదరాబాద్ పరిధి శంకర్‌పల్లిలో ఆస్తుల నమోదు ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్‌ హరీశ్‌ పరిశీలించారు. ధరణి పోర్టల్‌ సర్వేను నిర్లక్ష్యం చేశారని ఆరుగురు వీఆర్వోలు, ఐదుగురు బిల్‌ కలెక్టర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. గడుపులోగా సర్వే పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులకు అదనపు కలెక్టర్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని