బడిలో చిరుతపులి... విద్యార్థుల గజగజ

పాఠశాల ఆవరణలోకి  ప్రవేశించిన ఓ చిరుతపులి... విద్యార్థులను భయభ్రాంతులను చేసిన సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Updated : 27 Feb 2020 14:36 IST

పిలిభిత్‌: పాఠశాల ఆవరణలోకి  ప్రవేశించిన ఓ చిరుతపులి... విద్యార్థులను భయభ్రాంతులను చేసిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పులిని చూసి హడలిపోయిన విద్యార్థులు తరగతి గదుల్లోకి పరుగులుతీసి తలుపులు బిగించుకొన్నారు. కాగా, ఆ చిరుత ఓ కుక్కపై దాడి చేసి దానిని ఫిలిభిత్‌ టైగర్‌ రిజర్వ్‌లోని బారాహీ అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకుపోయింది. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు నిధి దివాకర్‌ రావటంతో, విద్యార్థులు ఆమెకు జరిగిన ఘటనను వివరించారు. ఆమె వెంటనే అటవీ అధికారులకు సమాచారమందించారు. అటవీ అధికారులు పాఠశాలను సందర్శించి పులిపంజా గుర్తుల ఫొటోలను తీశారు. ఈ చిరుత సమీపంలోని పొలాల నుంచి పాఠశాలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు. విద్యార్థుల భద్రత కోసం, చిరుత కదలికలను కనిపెట్టేందుకు పాఠశాల వద్ద సాయుధ సిబ్బందిని నియోగించారు. కాగా, చిరుత ఒకట్రెండు రోజుల్లో అడవిలోకి తిరిగి వెళ్లిపోతుందని అధికారులు భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని