చంకలో బిడ్డ.. సభలో విధులు

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సభలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా నోయిడాలో రూ.1,369కోట్లతో చేపట్టనున్న పనులకు సీఎం యోగీ శంకుస్థాపన చేశారు.

Published : 03 Mar 2020 00:33 IST

నోయిడా(ఉత్తరప్రదేశ్‌): యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సభలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా నోయిడాలో రూ.1,369కోట్ల విలువైన పనులకు సీఎం యోగి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమ భద్రత ఏర్పాట్లలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న వందలమంది పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రీతి రాణి అనే మహిళా కానిస్టేబుల్‌ తన బిడ్డతో పాటు ఈ సభకు వచ్చింది. చంకలో బిడ్డను ఎత్తుకొని సభలో తిరుగుతూ విధులు నిర్వర్తిస్తున్న ఆ కానిస్టేబుల్‌ను గమనించిన జనమంతా ఆమెను ఫొటోలు తీసేందుకు ఆసక్తి చూపించారు.
తన భర్త పరీక్ష రాసేందుకు వెళ్లడంతో బిడ్డను తాను సభకు తీసుకురావాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. మరి విధులకు ఒకరోజు సెలవు పెట్టవచ్చు కదా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆమె.. కుటుంబం ఎంత ముఖ్యమో ఉద్యోగం కూడా అంతే ముఖ్యమని చెప్పి ఉద్యోగం పట్ల తనకు ఉన్న నిబద్ధతను తెలియజెప్పింది. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఆమె ఇలాగే విధులు నిర్వర్తించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు