ప్రయాణికులు ఆందోళన పడకండి

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు భారతీయ రైల్వే మార్చి 22 నుంచి 31 వరకు అన్ని రకాల ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసింది. అయితే, అప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు తమ..

Updated : 25 Mar 2020 20:34 IST

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు భారతీయ రైల్వే మార్చి 22 నుంచి 31 వరకు అన్ని రకాల ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసింది. అయితే, అప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్ల రద్దు, నగదు వాపస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైల్వే బోర్డు తాజాగా ప్రకటించింది. మార్చి 21 నుంచి జూన్‌ 21 మధ్య తేదీల్లో ప్రయాణానికి బుక్‌ చేసుకున్న టికెట్లను ప్రయాణ తేదీ నుంచి మూడు నెలల కాల వ్యవధిలో ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చని తెలిపింది. ప్రయాణికుల టికెట్‌ రద్దు, నగదు వాపస్‌ కోసం ప్రయాణికులెవరూ రైల్వే స్టేషన్‌కు రావద్దని సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని