కరోనా కాలంలో యూరప్‌: ఎలా వెళ్లారంటే...

క్రిస్టీ రస్సెల్‌, ఆమె భర్త నాథన్‌ ఓ ఉపాయం ఆలోచించారు. దానిప్రకారం ఆ కుటుంబం సిడ్నీ నుంచి మ్యునిచ్‌కు ప్రయాణించారు. అదెలా అంటే...

Published : 18 Apr 2020 00:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ హనీమూన్‌ను యూరప్‌లో జరుపుకొన్న ఓ ఆస్ట్రేలియన్‌ జంట, తమ పిల్లలకు కూడా ఆ ప్రదేశాలను చూపించాలనుకున్నారు. కొన్ని వారాల పాటు యూరప్‌ను చుట్టివచ్చేలా ప్లాన్‌ చేసుకుని, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఐదు సంవత్సరాలుగా వేసుకుంటున్న వీరి ప్లాన్‌, కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వల్ల అనుకోని విధంగా ఫెయిల్‌ కావటంతో వారి ముగ్గురు పిల్లలు దిగులు పడ్డారు. వారిని ఉత్సాహ పరచటానికి క్రిస్టీ రస్సెల్‌, ఆమె భర్త నాథన్‌ ఓ ఉపాయం ఆలోచించారు. దాని ప్రకారం కుటుంబం సిడ్నీ నుంచి మ్యునిచ్‌కు ప్రయాణించారు. అదెలా అంటే...

వారందరూ కలసి సెక్యూరిటీ చెక్‌లు, విమాన సిబ్బంది, బోర్డింగ్‌ పాస్‌లతో సహా 15 గంటల విమాన యాత్రను ఇంట్లోనే ‘రీక్రియేట్‌’ చేశారు. అందరూ తమ లగేజ్‌ను సిద్ధం చేసుకుని ‘విమానాశ్రయాన్ని’ చేరుకున్నారు. అక్కడ వారి 16ఏళ్ల కుమారుడు భద్రతా అధికారిగా ఉండగా, వారి చిన్న కుమార్తె సామానును తనిఖీ చేసింది. చెకింగ్‌ అనంతరం వారు బోర్డింగ్‌ పాస్‌లను తీసుకుని గేట్‌ 1 నుంచి లోపలకు ప్రవేశించారు. వారి పెద్దమ్మాయేమో ‘ప్రయాణీకులను’ సాదరంగా విమానంలోకి ఆహ్వానించింది. అనంతరం విమానం కేబిన్‌గా మార్చిన వారి హాలులోకి ప్రవేశించారు.  క్రిస్టీ భర్త విమానంలో అందించటానికి భోజనాన్ని సిద్ధం చేశారు. తన స్కూల్‌ లైబ్రరీ నుంచి తీసుకువచ్చిన ట్రాలీతో విమానంలో మాదిరిగానే ఎయిర్‌లైన్‌ మీల్స్‌ను అందించారు. మార్గమధ్యంలో దోహాలో ఆగటంతో సహా అన్నీ నిజం ప్రయాణం మాదిరిగానే చేశారు. ఆ విధంగా 15 గంటలపాటు ‘ప్రయాణించిన’ అనంతరం తరువాతి రోజు మధ్యాహ్నానికి వారు తమ గమ్యం చేరుకున్నారు. 

కాగా, ఈ ‘ప్రయాణ’ వివరాలను వారు ఎప్పటికప్పుడు ఇంటర్‌నెట్లో షేర్‌ చేస్తూనే వచ్చారు. ఈ విధంగా చేయటంతో తమ కుటుంబంలో ఒకరికొకరు మరింత దగ్గరయ్యామని క్రిస్టీ అన్నారు. మొదట ఓ జోక్‌లాగా ప్రారంభించిన ఈ ప్రయత్నం పోనుపోను చాలా సరదా అనిపించిందన్నారు. పిల్లలకు ఈ ఆలోచన అంతగా నచ్చదేమో అనుకున్నాం కానీ వాళ్లు చాలా బాగా ఎంజాయ్‌ చేశారు... ఒకే గదిలో మేమందరం కలసి ఇంతసేపు గడపటం చాలాకాలం తర్వాత ఇదే మొదటిసారి. ఇది మాకు చాలా స్పెషల్‌.. అని ఆ క్రిస్టీ, రస్సెల్‌లు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు