ఏటీఎంలో మెషీన్‌లోకి వెళ్లిన పాము

ఏటీఎంలో ప్రవేశించిన అనుకోని అతిధి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Published : 13 May 2020 02:00 IST

ఘజియాబాద్‌: ఎక్కువమంది వినియోగించుకోని ఏటీఎంలలో వీధి కుక్కలు తిష్ట వేస్తుంటాయి. అలాంటిది ఏకంగా ఓ భారీ సర్పం ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లడమే కాదు, ఏకంగా మెషీన్‌లోకి వెళ్లిపోయింది. ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఘజియాబాద్‌లోని ఓ ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో అందరూ చూస్తుండగానే ఓ పాము ప్రవేశించింది. దీనిని గమనించిన సెక్యూరిటీ గార్డు ఏటీయం తలుపును మూసేయటంతో అది బయటకు రాలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత ఏటీఎం మెషీన్‌ పైకి ఎక్కి దానిలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా లోపలకు ప్రవేశించింది. ఈ సమాచారం అందటంతో సంఘటనా స్థలాన్ని చేరుకున్న అటవీ అధికారులు దానిని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.                  
 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని