YSRCP: బాలినేని X ఆమంచి

వైకాపా సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సీఎం ఆదేశాల మేరకు అయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ప్రకటన వెలువడింది.

Updated : 27 Sep 2023 07:32 IST

వైకాపా ఎస్‌ఎన్‌పాడు పరిశీలకుడిపై వేటు

 

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: వైకాపా సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సీఎం ఆదేశాల మేరకు అయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ప్రకటన వెలువడింది.

సీఎం జగన్‌ వద్ద పంచాయితీ..!: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసరెడ్డి తొలి నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు. ఆయన భార్య జడ్పీటీసీ సభ్యురాలు. పర్చూరు నియోజకవర్గ బాధ్యుడు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికీ మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. అదే సమయంలో బాలినేనికి భవనం శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో ఆమంచి వైకాపా అధిష్ఠానానికి భవనం తీరుపై ఫిర్యాదులు చేసి సస్పెండ్‌ చేయించినట్లు ప్రచారం. తన అనుచరుడైన భవనాన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని మాజీ మంత్రి బాలినేని తీవ్రంగా పరిగణించారు. జిల్లా పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా తన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని ఆయన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సస్పెండ్‌ చేసిన నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవాలంటూ సీఎంను కోరినట్లు ప్రచారం సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని