Andhra News: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద 650 మంది పోలీసులతో భద్రత

సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యూటీఎఫ్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated : 25 Apr 2022 03:55 IST

అమరావతి: సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యూటీఎఫ్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద 650 మంది పోలీసులను మోహరించారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు మోహరించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అన్ని మార్గాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. చెన్నై-కోల్‌కతా హైవే నుంచి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వైపు ఎవరూ రాకుండా ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ వారధికి వెళ్లే ముందే తనిఖీలు చేస్తూ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ముందస్తుగానే అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు జిల్లాల నుంచి వస్తున్న యూటీఎఫ్‌ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధిస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని