Telangana News: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో రూ.3 వేల కోట్ల రుణం

తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేసింది.

Published : 05 Mar 2024 23:11 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధింది హడ్కో రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 95,235 ఇళ్ల నిర్మాణం కోసం హౌజింగ్‌ బోర్డు ఈ రుణాన్ని వినియోగించనుంది. అంతకుముందు హౌజింగ్‌ బోర్డుకు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 57,141, పట్టణాల్లో 38,094 ఇళ్లు నిర్మించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మొదట ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని