TS Inter Results: ఫస్టియర్‌లో మేడ్చల్‌.. సెకండియర్‌లో ములుగు టాప్‌

తెలంగాణ ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 61.68 శాతం, ద్వితీయ సంవత్సరంలో 63.49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. 

Updated : 09 May 2023 15:10 IST

ఇంటర్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 63.85 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. ఫస్టియర్‌లో 4,33,082 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే.. వారిలో 2,72,208 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి చెప్పారు. సెకండియర్‌లో 3,80,920 మంది హాజరైతే.. వారిలో 2,56,241 మంది విద్యార్థులు పాసైనట్లు తెలిపారు.

ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌.. సెకండియర్‌లో ములుగు జిల్లాలు ప్రథమ స్థానంలో నిలిచినట్లు సబిత చెప్పారు. జూన్‌ 4 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్ల చెప్పారు. మే 10 నుంచి మే 16 వరకు రీకౌంటింగ్‌, రీ వాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని.. విద్యార్థులు, తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తొలిగించినట్లు మంత్రి చెప్పారు. 

తెలంగాణలో మేనేజ్‌మెంట్ వారీగా ఫలితాలిలా..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు