Botsa: పిల్లలను సరిగా స్కూల్‌కి పంపితే ‘అమ్మఒడి’ వర్తిస్తుంది: మంత్రి బొత్స వ్యాఖ్యలు

అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమని.. పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక జరిగిందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

Updated : 23 Jun 2022 13:47 IST

విజయనగరం: అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమని.. పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక జరిగిందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితే పథకం వర్తిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. విజయనగరంలో అమృత్‌ పథకంలో భాగంగా రూ.1.96కోట్ల వ్యయంతో నిర్మించిన వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

విజయనగరంలో ప్రతి ఇంటికీ కొళాయి కలెక్షన్‌ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని బొత్స చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ఇంటర్‌లో ఫలితాలు ఏమాత్రం తగ్గలేదని.. 2019 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమ్మఒడి పథకాన్ని అర్హులందరికీ ఇస్తున్నామని.. ఈ పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ముందుగానే చెప్పామన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని