Yuvagalam: లోకేశ్‌ను కలిసిన ఓఎన్‌జీసీ-గెయిల్‌ బాధితులు

యువగళం పాదయాత్రలో ఉన్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఓఎన్‌జీసీ - గెయిల్‌ బాధితులు కలిశారు.

Published : 27 Nov 2023 18:34 IST

కాకినాడ: యువగళం పాదయాత్రలో ఉన్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఓఎన్‌జీసీ - గెయిల్‌ బాధితులు సోమవారం కలిశారు. 2014లో గెయిల్‌ పైపులైన్లు పేలిపోయి 22 మంది మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గెయిల్‌ యాజమాన్యం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని లోకేశ్‌ ఎదుట బాధితులు వాపోయారు. ఈ మేరకు పి.గన్నవరం ప్రాంతానికి చెందిన గెయిల్‌ బాధితులు లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.

బాధితులను గెయిల్‌ అధికారులు ఆదుకోకపోవడం దురదృష్టకరమని ఈ సందర్భంగా లోకేశ్‌ అన్నారు. కష్టనష్టాలున్నా సంస్థకు స్థానికులు తమ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ‘‘బాధితులను ఆదుకోవాల్సిన పూర్తి బాధ్యత చమురు సంస్థలదే. తెదేపా అధికారంలోకి వచ్చాక పేలుడులో ధ్వంసమైన ఆలయాలను నిర్మిస్తాం. అధికారులతో మాట్లాడి బాధితుల హామీల అమలుకు కృషి చేస్తాం’’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని