PSLV: పీఎస్‌ఎల్వీ-సీ 52 వాహక నౌక కౌంట్‌డౌన్‌ ప్రారంభం

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) మరో ప్రయోగానికి సిద్ధమైంది.

Published : 13 Feb 2022 08:50 IST

సూళ్లూరు పేట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్వీ-సీ 52 వాహక నౌక ప్రయోగాన్ని సోమవారం ఉదయం 5.59 గంటలకు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఇది 25.30 గంటల పాటు కొనసాగిన అనంతరం పీఎస్‌ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది. వాహకనౌక 1710 కిలోల బరువు ఉన్న ఆర్‌ఐశాట్‌, 1705 కిలోల ఐఎన్‌ఎస్‌‌-2టీడీ, 8.1 కిలోల ఇన్‌స్పైట్‌-1 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ శనివారం షార్‌కు చేరుకుని ఎంఆర్‌ఆర్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం కూడా ఆయన ఇక్కడే ఉండి, కౌంట్‌డౌన్‌ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. శాస్త్రవేత్తలతో వివిధ ప్రాజెక్ట్‌లపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు