World Food Day: మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోండి!

ఆహారపు అలవాట్లపై మరింత శ్రద్ధ పెట్టాలన్న విషయాన్ని కొవిడ్‌-19 మరోసారి తెలియజేసింది. శుభ్రమైన.. మంచి ఆహారం తీసుకుంటూనే ఆరోగ్యంగా ఉండగలం. వ్యాధి నిరోధక శక్తి లభించి.. వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోగలం. నేడు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా.. మంచి

Published : 17 Oct 2021 01:43 IST

ఆహారపు అలవాట్లపై మరింత శ్రద్ధ పెట్టాలన్న విషయాన్ని కొవిడ్‌-19 మరోసారి తెలియజేసింది. శుభ్రమైన.. మంచి ఆహారం తీసుకుంటూనే ఆరోగ్యంగా ఉండగలం. వ్యాధి నిరోధక శక్తి లభించి.. వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోగలం. నేడు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా.. మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం ప్రారంభించండి. అందుకోసం ఈ చిట్కాలను పాటించండి..

* భోజనంలో అని రకాల పోషకాలు వచ్చేలా సమతుల్యం పాటించాలి. ఆహారంలో ఆకుకూరలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు ఉండేలా చూడాలి. సీజనల్‌గా వచ్చే పండ్ల(పుచ్చకాయలు, దానిమ్మ, సీతాఫలం వంటివి)ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

* నూనె ఎక్కువగా ఉపయోగించే చిప్స్‌, ఫ్రైస్‌ వంటి అల్పాహారానికి దూరంగా ఉండండి. వీటికి బదులు బాదం, పిస్తా, ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్‌, వేరుశెనగలను అల్పాహారంగా తీసుకోవచ్చు.

* ఆహారంలో తీపి మోతాదును బాగా తగ్గించండి. చక్కెర వాడాల్సిన చోట వీలైతే బెల్లం, తేనెను ఉపయోగించొచ్చు. తీపి పదార్థాలకు బదులు పండ్లు తినడం అలవాటు చేసుకుంటే మరీ మంచిది.

* చాలా మంది టీవీ చూస్తూ ఎంత తింటున్నామో కూడా గుర్తించలేకపోతున్నారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆహారం పరిమాణంపై దృష్టి పెట్టాలి. ఎక్కువ తింటే భుక్తాయాసం, అజీర్తి, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తొచ్చు. కాబట్టి.. తగినంత పరిమాణంలో ప్రతి రోజు.. వేళకి తినండి.

* బయట లభించే ప్రాసెస్డ్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ను తినడం మానేయండి. ఏదైనా తినాలిపిస్తే.. ఇంట్లోనే వండుకొని తినండి.

* శరీరం నిర్జలీకరణమై.. అలసిపోకుండా ఉండాలంటే.. రోజూ కనీసం 8 - 10 గ్లాసుల నీరు తాగండి. నీటికి బదులుగా కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, బట్టర్‌ మిల్క్‌ వంటి ద్రవ పదార్థాలు తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని