లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌.. ఎంతో ఉపయోగం

దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. దాదాపు 37లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనూ రికవరీ రేటు పెరగడం ఊరటనిచ్చే......

Updated : 03 Sep 2020 06:49 IST

రికవరీ రేటు పెరుగుతోందన్న వైద్యులు

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఏర్పాటు

ముంబయి: దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. దాదాపు 37లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనూ రికవరీ రేటు పెరగడం ఊరటనిచ్చే అంశం. దేశ రికవరీ రేటు దాదాపు 77 శాతంగా ఉంది. అలాగే మహారాష్ట్రలో 8 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు 5.80 లక్షల మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. దాదాపు 2లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో దాదాపు 25వేల మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఏర్పాటు చేసిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ వల్ల రికవరీ రేటు పెరిగిందని అధికారులు గుర్తించారు. అలాగే మరణాల రేటు కూడా తగ్గిందని పేర్కొన్నారు.

గత నెల 15న మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే జల్నా జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రిలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ఒకేసారి వందమంది బాధితులకు ఒకేసారి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. కొవిడ్‌ నివారణలో ఆక్సిజన్‌ థెరపీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రారంభంలో జిల్లాలో మరణాల రేటు 4.5 శాతంగా ఉండేదని, తర్వాత 2.8 శాతానికి పడిపోయిందన్నారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 71 శాతానికి చేరిందని వివరించారు. ప్రస్తుతం 238 కరోనా బాధితులకు ఈ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,808 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 148 మంది మృతి చెందారు. 3,269 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇదే ఆసుపత్రిలో టెలీ-ఐసీయూ సౌకర్యాన్ని ప్రారంభించారు. ప్రతి బెడ్‌కు ఏర్పాటు చేసిన మానిటర్‌ సాయంతో వేరే ప్రదేశం నుంచి కూడా పేషంట్‌ పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. ముంబయి, దిల్లీకి చెందిన ప్రత్యేక నిపుణుల సలహాలను కూడా తీసుకుంటూ ఉంటామని వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో త్వరలో ప్లాస్మా చికిత్స విధానాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు