Guntur: గుంటూరు జిల్లా అధికారులకు షాకిచ్చిన ఇసుక మాఫియా

గుంటూరు జిల్లా అధికారులకు ఇసుక మాఫియా గట్టి షాక్‌ ఇచ్చింది. 

Published : 17 Feb 2024 15:28 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా అధికారులకు ఇసుక మాఫియా గట్టి షాక్‌ ఇచ్చింది. తాడేపల్లి మండలం గుండిమెడ సమీపంలోని కృష్ణానదిలో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారన్న సమాచారంతో శుక్రవారం రెవెన్యూ, గనులశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. క్వారీలో ఇసుక తవ్వుతున్న జేసీబీ, లారీని జప్తు చేసి తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ఉన్న లారీని ఇసుక మాఫియా మారు తాళంతో ఎత్తుకెళ్లింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జప్తు చేసిన లారీని పోలీస్‌ స్టేషన్లో అప్పగించకుండా తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఎందుకు పెట్టారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇసుక మాఫియాతో మాట్లాడుకునేందుకే లారీని స్టేషన్‌లో అప్పగించకుండా రెవెన్యూ కార్యాలయం దగ్గర పెట్టారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని