Shimla: ధవళ వర్ణంలో మెరిసిపోతున్న హిమాచల్.. కనువిందు చేస్తోన్న సోయగాలు..!

హిమాచల్ ప్రదేశ్‌ రాజధాని సిమ్లా ధవళ వర్ణంతో మెరిసిపోతోంది.

Updated : 25 Jan 2022 06:08 IST

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ రాజధాని సిమ్లా ధవళ వర్ణంతో మెరిసిపోతోంది. మంచు దుప్పటి కప్పుకొని కనువిందు చేస్తోంది. చలి తీవ్రత పెరగడంతో కొద్ది రోజులుగా రాజధాని నగరంతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ఇళ్లు, చెట్లు, వాహనాలు వేటీ మీద చూసినా.. మంచు నిండిపోయి కనిపిస్తోంది. జనవరి 25 వరకు హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడి చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రకృతి అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి అందాలను వీక్షించేందుకు స్విట్జర్లాండ్ వరకు వెళ్లాల్సిన పనిలేదు.. ఒకసారి సిమ్లా చిత్రాలను చూస్తే సరి అంటూ కొన్నింటిని పంచుకున్నారు. అవేంటో ఒకసారి మనమూ చూద్దామా..!  

ఇంటికి సరికొత్త శోభ తెచ్చిన హిమపాతం   

సిమ్లాకి సమీపంలోని ఓ ప్రాంతంలో

మంచుతో నిండిపోయిన రైలుపట్టాలు

చూడదగ్గ దృశ్యాలంటూ భారత రైల్వేశాఖ కల్కా-సిమ్లా రైల్వే సెక్షన్‌ దగ్గర్లోని ఈ చిత్రాలను షేర్ చేసింది.

సిమ్లా వీధుల్లో




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని