TS News: యాదాద్రి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్‌ (రెవెన్యూ) భాస్కరరావుపై సస్పెన్షన్‌ వేటు పడింది.

Published : 04 Mar 2024 18:50 IST

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్‌ (రెవెన్యూ) భాస్కరరావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఆయనను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తూ.. ఇంకా మూడేళ్లు పూర్తి కాలేదని తప్పుడు నివేదిక ఇవ్వడంతో విచారణ జరిపిన ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని