Andhra News: నారాయణ బెయిల్‌ రద్దు చేయాలంటూ చిత్తూరు పోలీసుల పిటిషన్‌

మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు చిత్తూరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 13 May 2022 12:32 IST

చిత్తూరు: మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు చిత్తూరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈనెల 10న నారాయణను చిత్తూరు పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయన్ను చిత్తూరు తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

అదే రోజు బెయిల్‌ పిటిషన్‌ను నారాయణ తరఫు న్యాయవాదులు దాఖలు చేయగా.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున  న్యాయవాదులు న్యాయమూర్తి సులోచనారాణికి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. నారాయణకు బెయిల్‌ మంజూరు చేశారు. 

ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్తూరు పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ సుధాకర్‌రెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తూ.. నారాయణ బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని