
Cm KCR: చిన్నారికి సీఎం కేసీఆర్ నామకరణం.. ఏం పేరు పెట్టారో తెలుసా?
రామడుగు: కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ ఓ చిన్నారికి నామకరణం చేశారు. పర్యటనలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్లో దళితబంధు అమలుపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత, లక్ష్మణ్ దంపతులు సీఎం కేసీఆర్ను కలిసి తమ కుమారుడికి పేరు పెట్టాలని కోరారు. చిన్నారిని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నారికి ‘తారక రామారావు’గా నామకరణం చేశారు. ఎంపీపీ ఇంటిపేరు కలిగేటి కావడం.. చిన్నారి పేరు తారక రామారావుగా పెట్టడంతో అక్కడే ఉన్న కొంత మంది పార్టీ శ్రేణలు కేటీఆర్ (కలిగేటి తారక రామారావు) అని చర్చించుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.