Cyclone Gulab: తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు

గులాబ్‌ తుపాను ప్రభావం తెలంగాణపై పడుతోంది. రాష్ట్రంలోని 14 జిల్లా్ల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని

Updated : 27 Sep 2021 16:49 IST

హైదరాబాద్: గులాబ్‌ తుపాను ప్రభావం తెలంగాణపై పడుతోంది. రాష్ట్రంలోని 14 జిల్లా్ల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని