AP News: తిరుమల- పాపవినాశనం రోడ్డు మూసివేత

తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో

Updated : 31 Oct 2023 16:36 IST

తిరుమల: తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. గాలుల ధాటికి పలు చోట్ల పదుల సంఖ్యలో భారీ వృక్షాలు, చెట్టు కొమ్మలు రోడ్లపై పడ్డాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తిరుమల- పాపవినాశనం రోడ్డును అధికారులు మూసివేశారు. అటవీ, తితిదే అధికారులు రంగంలోకి దిగి రోడ్లపై పడిన చెట్లను తొలగిస్తున్నారు. 

మరోవైపు వర్షం కారణంగా రెండు ఘాట్‌ రోడ్లలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఘాట్‌ రోడ్డులో ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని