TTD: అన్నమయ్య మార్గం అభివృద్ధికి డీపీఆర్‌ సిద్ధం చేయండి: వై.వి.సుబ్బారెడ్డి

వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్యులు నడచిన మార్గం ద్వారా సొంత వాహనాల్లోను, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి

Published : 02 Jan 2022 17:59 IST

తిరుమల: వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్యులు నడచిన మార్గం ద్వారా సొంత వాహనాల్లోను, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు సమగ్ర నివేదికలు (డీపీఆర్) తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.  మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని ఆదివారం సుబ్బారెడ్డి పరిశీలించారు. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు వెంటనే సమగ్ర సర్వే చేసి అటవీశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. హైదరాబాద్, వైఎస్ ఆర్ కడప మార్గం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు అన్నమయ్య మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వర్షాల వల్ల ఇటీవల కొండ చరియలు విరిగిపడి  తిరుమల ఘాట్ రోడ్ భారీగా దెబ్బతిన్న విషయాన్ని ఛైర్మన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని