Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 19 Apr 2024 17:00 IST

1. తొలి విడత పోలింగ్‌.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!

దేశవ్యాప్తంగా లోక్‌సభ తొలివిడత పోలింగ్ జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణిపుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో కాల్పులు వినిపించాయి. దానికి సంబంధించి వీడియో క్లిప్‌ ఒకటి వైరల్‌గా మారింది.  ప్రజలు పరుగులు పెట్టిన దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇన్నర్‌ మణిపుర్‌, ఔటర్‌ మణిపుర్.. ఈ రెండు స్థానాల్లో ఎక్కడ ఈ ఘటన జరిగిందో తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ‘దుబాయ్‌ ప్రయాణాలను రీషెడ్యూల్‌ చేసుకోండి’ - ఇండియన్‌ ఎంబసీ అడ్వైజరీ

దుబాయ్‌లో వరదల (Dubai Floods) నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. దుబాయ్‌కు వచ్చేవారు, స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్‌ చేసుకోవాలని తాజా అడ్వైజరీలో పేర్కొంది. భారీ వరదల నేపథ్యంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ సూచనలు పాటించాలని తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.  భారాస అధినేత కేసీఆర్‌ బస్సు యాత్ర షెడ్యూల్‌ ఖరారు

తెలంగాణ గొంతుకే అజెండాగా, పార్టీకి పూర్వవైభవమే ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి (BRS) లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏప్రిల్‌ 22 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. కాంగ్రెస్, భాజపా వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు భారాస హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. చంద్రబాబు తరఫున నామినేషన్‌ వేసిన నారా భువనేశ్వరి

పట్టణం: తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్‌ వేశారు. కుప్పంలో రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి నామినేషన్‌ పత్రాలను ఆమె సమర్పించారు. అంతకుముందు భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ వైకాపా పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్‌

 48 సార్లు భోజనంలో కేవలం మూడు మామిడి పండ్లు తీసుకున్నానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వెల్లడించారు. ఒక్కసారి మాత్రమే ఆలూపూరీ తిన్నానని చెప్పారు. అది కూడా నవరాత్రి ప్రసాదమని శుక్రవారం దిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు. తిహాడ్‌ జైల్లో తనకు ఇన్సులిన్ అందించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా తన వాదనను వినిపించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్‌బై!

 భారాసకు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు ఆయన తెలిపారు. నేడో, రేపో అనుచరులతో కలిసి చేరతానని చెప్పారు. ఇప్పటికే భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7.మా ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే.. మాడి మసైపోతావ్‌: కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ ఫైర్‌

షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు.. అది పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారాస అధినేత కేసీఆర్‌ (KCR) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. మెటా ప్లాట్‌ఫామ్స్‌లో ఏఐ.. వాట్సప్‌లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రేసులో అడుగుపెట్టింది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికలకు తన మెటా ఏఐని ఇంటిగ్రేట్‌ చేసింది. లాలామా 3 లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ఆధారంగా పని చేస్తుంది. దీంతో చాట్‌జీపీటీ తరహాలో మెటా ఏఐ చాట్‌బాట్‌ ఏ ప్రశ్నకైనా చిటికెలో సమాధానం రాబట్టొచ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.  నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు

నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. ఇటీవల విడవలూరు మండలానికి చెందిన 40 మంది కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో తెదేపాలో చేరగా.. తాజాగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ సమక్షంలో దాదాపు 100 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ‘సివిల్స్‌’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్‌లు విడుదల

సివిల్‌ సర్వీస్‌ పరీక్ష.. లక్షలాది మంది కల. దీన్ని సాకారం చేసుకోవడమంటే అంత ఆషామాషీ కాదు. లక్షల మంది  ప్రిలిమ్స్‌ రాస్తే.. చివరకు ఎంపికయ్యేది వందల్లోనే. దీన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదలతో పాటు కఠోర శ్రమ, కచ్చితమైన ప్రణాళిక అవసరం. ఇటీవల విడుదలైన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష‌-2023 ఫలితాల్లో (UPSC Civils 2023 Result) అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని