Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ న్యూస్‌

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన వార్తలు మీ కోసం... 

Published : 25 Aug 2022 13:02 IST

1. ఈ పోలీసుల కంటే బ్రిటీష్‌ వాళ్లే నయం: చంద్రబాబు

పోలీసులు సరిగా పనిచేయకుంటే ప్రజా తిరుగుబాటు ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కుప్పంలో తన రెండో రోజు పర్యటనకు వైకాపా అడ్డంకులు సృష్టించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తలు అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేయడం, తెదేపా ఫ్లెక్సీల చించివేయడంపై మండిపడ్డారు . పోలీసులు సరిగా పనిచేయకుంటే ప్రజా తిరుగుబాటు ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కుప్పంలో తన రెండో రోజు పర్యటనకు వైకాపా అడ్డంకులు సృష్టించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. రివ్యూ: లైగర్‌

హిందీలో ఒక్క సినిమా చేయ‌క‌పోయినా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay devarakonda). ఆయ‌న్ని ‘లైగ‌ర్‌’(Liger Review)తో పాన్ ఇండియా స్థాయిలో ప‌రిచ‌యం చేస్తున్నారు పూరి జ‌గ‌న్నాథ్‌. ఈ క‌ల‌యికే ఒక ప్ర‌త్యేకం అనుకుంటే... ఇందులో బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ న‌టించ‌డం మ‌రో ప్ర‌త్యేక‌త.  కొన్నాళ్లుగా దేశ‌మంతా ‘లైగ‌ర్’ ప్ర‌చార హోరు కొన‌సాగింది. ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి, అంచ‌నాల్ని రేకెత్తించాయి. పాన్ ఇండియా సినిమాల హంగామా కొన‌సాగుతున్న ఈ ద‌శ‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ‘లైగ‌ర్‌’ (Liger Review) ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..! మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఐదు ఫోన్లలో మాల్‌వేర్‌ ఉందికానీ.. అది పెగాసస్ అని చెప్పలేం..!

పెగాసస్ స్పైవేర్ గత ఏడాది దేశ రాజకీయాలను కుదిపేసింది. దీనిపై వాస్తవాలను వెలికితీసేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కమిటీ రిపోర్టు ఇవ్వగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని గురువారం ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇప్పటివరకూ 29 ఫోన్లను పరిశీలించగా.. ఐదింటిలో ఒక మాల్‌వేర్‌ ఉందని గుర్తించినట్లు చెప్పారు. కానీ, అది పెగాసస్ స్పేవేర్ అనే కచ్చితమైన రుజువు లభించలేదని ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. కడపలో మీటింగ్‌ పెడతాం.. ఎలా అడ్డుకుంటారో చూస్తాం: అచ్చెన్న 

కుప్పంలో అన్నా క్యాంటీన్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ దాడి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబును కుప్పంలో తిరగకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అది నా కష్టార్జితం.. దాంతో అతడికి సంబంధం లేదు..!

సుకేశ్‌ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల మోసపూరిత వసూళ్ల కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఇటీవల ఈడీ నిందితురాలిగా పరిగణించింది. కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్‌ చేశారు. వీటిల్లో రూ.7 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. అయితే, ఆ డబ్బును తాను కష్టపడి సంపాదించాని, అది నేరాల ద్వారా వచ్చిన సొమ్ము కాదని ఆమె వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌ను మా కీలక భాగస్వామిగా చూస్తాం: శ్వేతసౌధం

భారత్‌ను అమెరికా కీలక భాగస్వామిగా చూస్తామని శ్వేత సౌధం ప్రకటించింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కరీన్‌ జిన్‌పియర్‌ బుధవారం సాయంత్రం రోజువారీ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ ‘‘మేం భారత్‌ను కీలక భాగస్వామిగా చూస్తాం. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ను ముందుకు తీసుకెళ్లడంపై ఉన్న మా నిబద్ధతతోనే ఈ వ్యూహాత్మక బంధం నిర్మితమైంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. వాట్సాప్‌ ప్రైవసీ పాలసీపై సీసీఐ విచారణకు దిల్లీ హైకోర్టు ఓకే

తమ 2021 అప్‌డేటెడ్‌ ప్రైవసీ పాలసీపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ చేపట్టడాన్ని సవాలు చేస్తూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ దాఖలు చేసిన పిటిషన్లను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని తేల్చి చెప్పింది. విచారణను కొనసాగించాలంటూ గతంలో ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పుతో డివిజన్‌ బెంచ్‌ ఏకీభవించింది. దీంతో సీసీఐ వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీపై విచారణ కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. పాకిస్థాన్‌ కర్నల్‌ రూ.30 వేలు ఇచ్చి కశ్మీర్‌ పంపాడు!

 భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని సైన్యం అరెస్టు చేసి విచారించగా ఆసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి. ఆగస్టు 21న కశ్మీర్‌లోని నౌషారా సెక్టార్‌ వద్ద జంగర్‌ అనే ప్రదేశంలో కొందరు ఉగ్రవాదులను భారత సైన్యం గమనించింది. వారు కంచెను కత్తిరిస్తుండగా దళాలు అప్రమత్తమై దాడి చేశాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. విజయవాడ చేరుకోవాల్సిన విమానంలో సాంకేతిక లోపం

 దిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యమైంది. ఉదయం 7.30 గంటలకు చేరుకోవాల్సిన విమానం 10.30 అయినా చేరుకోలేదు. దిల్లీలో విమానం బయల్దేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తిందని.. దీంతో వెనక్కి మళ్లించి మరమ్మతులు చేపట్టినట్లు విజయవాడ విమానాశ్రయం అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఎయిర్‌టెల్‌లో పెరగనున్న మిత్తల్‌ వాటా.. సింగ్‌టెల్‌తో రూ.12895 కోట్ల ఒప్పందం

భారతీ ఎయిర్‌టెల్‌లో ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ తన వాటాను మరింత పెంచుకోబోతున్నారు. ఈ మేరకు సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న టెలికాం కంపెనీ సింగ్‌టెల్‌కు ఎయిర్‌టెల్‌లో ఉన్న వాటా నుంచి 3.3 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నారు. ఇది పూర్తిగా షేర్ల కొనుగోలు ఒప్పందం. దీని విలువ దాదాపు రూ.12,895 కోట్లు. ప్రమోటర్‌ సంస్థ భారతీ టెలికాం పేరు మీదుగా ఈ ఒప్పందాన్ని పూర్తిగా చేయనున్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని