Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 May 2022 13:20 IST

1. మా కార్యకర్తలను ఎంతలా ఇబ్బందిపెడితే అంతగా రెచ్చిపోతారు: చంద్రబాబు

గత 40 ఏళ్లలో తెదేపా ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తయితే.. ఈ మూడేళ్లలో వచ్చిన ఇబ్బందులు ఒక ఎత్తు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తమ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతగా రెచ్చిపోతారని చెప్పారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా ‘మహానాడు’లో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వైకాపా పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉన్మాది పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని.. చేతగాని దద్దమ్మ పాలనతో రాష్ట్రం పరువు పోయిందని చంద్రబాబు ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఈ క్రూరమైన పదవి నాకొద్దు.. రాజస్థాన్‌ సీఎంకు మంత్రి ట్వీట్‌

 అంతర్గత విభేదాలతో సతమతమవుతోన్న రాజస్థాన్‌ కాంగ్రెస్‌కు ఇప్పుడు మరో తలనొప్పి మొదలైంది. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ప్రధాన కార్యదర్శి తీరుతో అసంతృప్తికి గురైన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అశోక్‌ చాంద్నా ట్విటర్‌ వేదికగా దాన్ని బయటపెట్టారు. ప్రధాన కార్యదర్శే అన్ని శాఖలకు మంత్రిలాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటప్పుడు ఈ మంత్రి పదవి తనకు వద్దంటూ అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రివ్యూ: ఎఫ్‌3

వెంకీ (వెంక‌టేష్‌)కి ఇంటి నిండా స‌మ‌స్య‌లే. స‌వ‌తి త‌ల్లి పోరు ఒక‌ ప‌క్క‌... స‌మ‌స్య‌లు మ‌రో ప‌క్క... వాటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు అడ్డ‌దారుల్లో సంపాద‌న‌పై దృష్టిపెడ‌తాడు. వ‌రుణ్ (వ‌రుణ్‌తేజ్‌) ఖ‌రీదైన క‌ల‌లు క‌నే యువ‌కుడు. కానీ చేతిలో మాత్రం చిల్లిగ‌వ్వ ఉండ‌దు. అత‌ను ఎలాగైనా ధ‌న‌వంతులైన కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమ‌లో ప‌డేసి ఆమెని అడ్డం పెట్టుకుని డ‌బ్బు సంపాదించాల‌నుకుంటాడు. హ‌నీ (మెహ్రీన్‌) కూడా త‌న కుటుంబం స‌మ‌స్య‌ల నుంచి గట్టెక్కాలంటే ధ‌నికుడైన అబ్బాయిని పెళ్లి చేసుకోవ‌డ‌మే మార్గం అనుకుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘టాంబ్‌ ఆఫ్ సాండ్‌’ భారతీయ నవలకు ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌

భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీని అంతర్జాతీయ పురస్కారం బుకర్ ప్రైజ్ వరించింది. ఆమె రచించిన ‘టాంబ్‌ ఆఫ్ సాండ్‌’కు ఈ ఘనత దక్కింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకున్న తొలి హిందీ నవల ఇది. రెట్ సమాధి పేరిట గీతాంజలి 2018లో ఈ నవలను రచించారు. తర్వాత అది ‘టాంబ్‌ ఆఫ్ సాండ్‌’గా ఆంగ్లంలోకి తర్జుమా అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు చేరువైన ఈ పుస్తకం 2022 ఏడాదికి గానూ అవార్డును పొందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. School Shooting: 11 ఏళ్ల చిన్నారి ఒంటికి రక్తం పూసుకుని.. చనిపోయినట్లు నటించి..!

‘‘డాడ్‌.. మా టీచర్‌ను, ఫ్రెండ్స్‌ను చంపేశారు. నన్నూ చంపేస్తాడేమోనని భయం వేసింది. వెంటనే ఒంటికి రక్తం పూసుకుని కింద పడిపోయా. చనిపోయినట్లు నటించా. ఆ తర్వాత అతడు క్లాస్‌ నుంచి వెళ్లిపోయాడు’’.. టెక్నాస్‌ మారణహోమం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ 11 ఏళ్ల చిన్నారి తన తండ్రికి చెప్పిన మాటలివి. యువాల్డీ పట్టణంలోని రాబ్‌ ప్రాథమిక పాఠశాలలో ఓ దుండగుడు చిన్నారులపై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు మియా సెరిల్లో అనే చిన్నారి చేసిన ఆలోచన ప్రతి హృదయాన్ని కలచివేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మంత్రుల బస్సు యాత్రలో వస్తోంది ‘అలీబాబా 40 మంది దొంగలు’: అచ్చెన్నాయుడు

రానున్న ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా గెలిచితీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆ గెలవడం మామూలుగా ఉండకూడదని.. 160 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి చంద్రబాబును సీఎం చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఈ విషయంలో తెదేపా కార్యకర్తలపై గురుతర బాధ్యత ఉందన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా ‘మహానాడు’లో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. F.I.R.E. Method: 40ల్లోనే రిటైర్ కావాలంటే మీరు ‘ఫైర్‌’ కావాల్సిందే!

రిటైర్‌మెంట్‌ అనగానే చాలా మంది 60 ఏళ్ల తర్వాత జీవితమే అనుకుంటుంటారు. ఆ వయసులో పింఛను తీసుకుంటూ మలిదశ జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటారు. కానీ, ఉన్న ఒక్క జీవితంలో మన కలలన్నింటినీ రిటైర్‌మెంట్‌  తర్వాత నిజం చేసుకోవడం సాధ్యమేనా? ఉద్యోగమో లేక వ్యాపారమో చేసే సమయంలో ఉండే బరువు, బాధ్యతల వల్ల ఎలాగూ కొన్ని మనసుకు నచ్చిన పనుల నుంచి దూరంగా ఉండాల్సిందే. మరి రిటైర్‌మెంట్‌ (Retirement) తర్వాత కూడా వాటిని సుసాధ్యం చేసుకోలేకపోతే ఇంకెప్పుడు మరి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Yoga Utsav: ఎల్బీ స్టేడియంలో ‘యోగా ఉత్సవ్‌’

యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘యోగా ఉత్సవ్‌’ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌తో కలిసి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దాదాపు వంద రోజుల ముందు నుంచే వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కిషన్‌ రెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఈసారి కప్పు బెంగళూరుదే.. గట్టి నమ్మకం: భజ్జీ

భారత టీ20 మెగాటోర్నీ 15వ సీజన్‌లో ఈసారి బెంగళూరు టీమ్‌ విజేతగా నిలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, అందుకు తగ్గ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించి ఆ జట్టు ఫైనల్లో గుజరాత్‌తో తలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సోషల్‌ మీడియా నటి హంతకులతో సహా నలుగురు ఉగ్రవాదుల హతం

కశ్మీరీ టీవీ, సోషల్‌ మీడియా నటి అమ్రీన్‌ భట్ హంతకులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆమె హత్య జరిగిన 24 గంటల్లోనే భద్రతా దళాలు వారిని ఎన్‌కౌంటర్‌ చేశాయి. అవంతిపొరాలోని అగన్‌హజిపొరాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు మృతి చెందారు. వీరిద్దరు స్థానిక ఉగ్రవాదులే అని భద్రతా దళాలు తెలిపాయి. వీరిలో షాహిద్‌ ముస్తాక్‌ భట్‌ బుద్గాం వాసి కాగా..మరో ఉగ్రవాది ఫర్హాన్‌ హబీబ్‌ పుల్వామాలో హికీంపొరా వాసిగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని