Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Aug 2022 13:23 IST

1. వెంకయ్యనాయుడి నుంచి సమాజం చాలా నేర్చుకోవాలి: ప్రధాని మోదీ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అత్యంత జనాదరణ ఉన్న నాయకుడని.. అనేక బాధ్యతలను ఆయన సమర్థంగా నిర్వర్తించారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. కొత్తతరంతో వెంకయ్య అనుసంధానమయ్యారని చెప్పారు. ఈనెల 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తిచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోలు ప్రసంగంలో ప్రధాని మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. స్టీపుల్‌ఛేజ్‌.. భారతీయులూ గెలవగలరని నిరూపించాడతడు..!

‘‘లాంగ్‌ డిస్టెన్స్‌ రేసుల్లో ఆఫ్రికన్లు, కెన్యన్లు, ఇథోపియన్లే కాదు.. భారతీయులు కూడా పతకాలు సాధించగలరని నిరూపించి చూపించాను’’ అంటున్నాడు 27ఏళ్ల అవినాశ్ ముకుంద్‌ సాబలే. గత శనివారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌లో అవినాష్‌ రజత పతకం సాధించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో లాంగ్‌ డిస్టెన్స్‌లో పతకం నెగ్గిన తొలి భారత పురుష అథ్లెట్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు. ఇంతకీ ఏంటీ స్టీపుల్‌ ఛేజ్‌ ప్రత్యేకత.. కెన్యన్లను వెనక్కి నెట్టి సాబలే ఎలా విజయం సాధించాడో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఐస్‌క్రీం ఇప్పుడు తినొచ్చు.. ఇదే అమ్మకు బర్త్‌డే గిఫ్ట్‌..!

3. కొవిడ్‌ చికిత్సకు డబ్బు అందిందా?అయితే, పన్ను మినహాయింపు పొందొచ్చు!

కొవిడ్‌-19 (Covid-19) బారిన పడిన ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యుల చికిత్సకు కొన్ని కంపెనీలు ఆర్థిక సాయం చేశాయి. మరికొన్ని సందర్భాల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందజేశాయి. అలాగే కొందరు వ్యక్తులు, బంధువులు, ఇతర సన్నిహితులు కూడా సాయం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇలా అందిన మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు (Tax Exemption) ఉంటుంది. దీన్ని క్లెయిమ్‌ చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు, ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను ‘కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT)’ ఇటీవల విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ నలుగురు మంత్రులు ఉద్యమకారులా?: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

తెరాస.. తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. తెరాస, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఆయన అందజేశారు. తన రాజీనామాను సభాపతి ఆమోదించినట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు.. స్టార్‌ హీరో ఎవరో తెలియదన్నాడు

నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ, అదే రంగానికి చెందిన స్టార్‌హీరో ఎవరో తెలియదంటూ ఓ సీనియర్‌ నటుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. పరిశ్రమలోనే కొనసాగుతున్నప్పటికీ తాను అస్సలు సినిమాలు చూడనంటూ ఆయన చెప్పడంపై నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ‘‘ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోల గురించే తెలియనప్పుడు, ఇక్కడుండి ఏం లాభం’’ అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ సీనియర్‌ నటుడెవరు? ఆయన తెలియదని చెప్పిన స్టార్ ఎవరు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణకు భారీ వర్షాలు!

ఒడిశా- కోస్తాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య దిశగా కదులుతూ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాపై కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాలు, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈనెల 9, 10 తేదీల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో  మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!

దక్షిణ చైనా సముద్రంలో నాలుగు రోజులపాటు లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ పేరిట డ్రాగన్‌ చేసిన హడావుడి బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే తైవాన్‌ ఆర్థిక వ్యస్థను ఉక్కిబిక్కిరి చేసేలా యుద్ధ విన్యాసాలను చేసినట్లు డ్రాగన్‌ సంబరపడుతోంది. భవిష్యత్తులో తరచూ నిర్వహిస్తామని కూడా చెబుతోంది. ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా తైవాన్‌  జల సంధి సంక్షోభం కూడా తోడైతే.. అది చైనా ఆర్థిక వ్యవస్థపై  భస్మాసుర హస్తం వలే పరిణమించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈ వారం అటు థియేటర్‌.. ఇటు ఓటీటీలో సినిమాలే సినిమాలు..!

ఒక్క విజయం కూడా లేకుండా టాలీవుడ్‌ను జులై ఉసూరుమనిపిస్తే, ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు విజయోత్సాహాన్ని ఇచ్చాయి. అదే ఊపును కొనసాగించేందుకు తాము సిద్ధమంటూ ఆగస్టు రెండో వారంలో కొన్ని చిత్రాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘లవ్‌స్టోరీ’లో బాబాయ్‌ పాత్ర.. ఇబ్బంది పడ్డా! : రాజీవ్‌ కనకాల

9. అమ్మాయిల ఫైనల్‌ పోరు సమయంలో.. రోహిత్‌ సేన ఇలా..

కామన్వెల్త్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత్‌ రజత పతకం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ పోరులో 9 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్‌ సేన ఓటమి పాలైంది. అయితే.. తొలి మ్యాచ్ నుంచి మంచి ప్రదర్శన కనబరిచి ఫైనల్‌ వరకూ చేరిన అమ్మాయిలు క్రికెట్‌ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇక చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్‌ పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతోపాటు భారత క్రికెట్‌ పురుషుల జట్టు కూడా ఆసక్తిగా వీక్షించడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేడుకలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని