Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Sep 2022 13:52 IST

1. షాకింగ్‌.. బైక్‌ లిఫ్ట్‌ అడిగి ఇంజెక్షన్‌ ఇచ్చి చంపేశాడు!

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైక్‌ను ఆపి లిఫ్ట్‌ అడిగిన దుండగుడు.. కొంతదూరం వెళ్లాక వాహనదారుడికి ఇంజెక్షన్‌ ఇచ్చాడు. అనంతరం వాహనదారుడు స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు.  వివరాల్లోకి వెళితే.. చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్‌ జమాల్‌ సాహెబ్‌ (40) తన చిన్న కుమార్తెను ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బిగ్‌ సేల్‌లో పాల్గొంటున్నారా? ముందే ఈ ప్రశ్నలు వేసుకోండి!

ఒకప్పుడు అవసరమైతేనో లేక పండగలప్పుడో మాత్రమే షాపింగ్‌ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు ఇ-కామర్స్‌ సంస్థలు ఎప్పుడు రాయితీలు, ప్రయోజనాలు ప్రకటిస్తే అప్పుడు కొనుగోలు చేయాలని నియమం పెట్టుకుంటున్నారు. ఫలితంగా అవసరం తీరడంతో పాటు కావాల్సిన వస్తువు తక్కువ ధరలో లభ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ పండగ సీజన్‌లో ఇ-కామర్స్‌ సంస్థలు ప్రకటించే ఆఫర్ల మోజులో పడి కొంతమంది విచ్చలవిడిగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తైవాన్‌కు మేమున్నాం.. మళ్లీ కవ్వించిన బైడెన్‌..!

తైవాన్‌ అంశంలో చైనాలో గందరగోళం సృష్టించే పనులను అమెరికా చేస్తూనే ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మరోసారి విజయవంతంగా అస్పష్టతను కొనసాగించారు. ఊహించని దాడుల నుంచి తైవాన్‌ను తాము రక్షిస్తామని పునరుద్ఘాటించారు. ఆయన ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తైవాన్‌ రక్షణకు అమెరికా దళాలు వెళ్తాయా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి బైడెన్‌ నిస్సంకోచంగా ‘అవును’ అని తేల్చిచెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చండీగఢ్‌ వర్సిటీ వసతిగృహ వార్డెన్‌పై వేటు..!

అభ్యంతరకర వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయంటూ ఆందోళనకు దిగిన విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించిన చండీగఢ్‌ వర్సిటీ  హాస్టల్‌ వార్డెన్‌పై వేటు పడింది. వీడియో లీక్‌ కేసులో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ నిర్వాహకులు.. హాస్టల్‌ వార్డెన్‌ రాజివిందర్‌ కౌర్‌ను సస్పెండ్‌ చేశారు. విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించినందుకు ఈ చర్యలు తీసుకొన్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోన్న మెగాహీరో...!

‘ఆకాశాన్ని తాకేందుకు..’ అంటూ మెగా హీరో వరణ్‌తేజ్‌ తన తదుపరి చిత్రంపై ఇటీవల ప్రత్యేక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ముంబయిలో అధికారికంగా  ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.  సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో వరుణ్‌ హిందీ చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘మరణశిక్ష తగ్గింపుపై’ విస్తృత ధర్మాసనానికి..

మరణ శిక్ష విధించే కేసుల విచారణ సమయంలో శిక్ష తగ్గింపు నిర్ధారణకు స్పష్టమైన విధివిధానాల రూపకల్పన అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ ఎస్‌.ధులియాలతో కూడిన బెంచ్‌ విచారించింది. తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్‌ భట్‌ మాట్లాడుతూ.. ‘‘దీనిని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. ఎప్పుడు..? ఎక్కడ? చూసేదెలా?

టీ20 ప్రపంచకప్‌నకు ముందు రిహార్సల్స్‌.. బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్‌ను సెట్‌ను చేసుకోవడానికి భారత్‌కు మంచి తరుణం. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం తొలి మ్యాచ్‌ జరగనుంది. సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకొని వచ్చాడు. అలాగే యువ బౌలర్‌ హర్షల్‌ పటేల్ కూడా జట్టుతో చేరాడు. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్‌ జట్టులోనూ ఉన్నారు. దీంతో చాలా రోజుల తర్వాత  మైదానంలోకి దిగుతున్న బుమ్రా, పటేల్ ఎలా రాణిస్తారనేది వేచి చూడాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భాజపా టార్గెట్‌ మద్యం కుంభకోణమా?.. మున్సిపల్‌ ఎన్నికలా?

 దేశ రాజధాని దిల్లీలో మద్యం కుంభకోణం వ్యవహారంలో మరో ఆప్‌ ఎమ్మెల్యేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నుంచి సమన్లు జారీ అయ్యాయి. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికలకు ఆప్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దుర్గేశ్‌ పాఠక్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ఈ పరిణామాలపై దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా తీవ్రంగా మండిపడ్డారు. భాజపా మద్యం కుంభకోణాన్ని టార్గెట్‌ చేస్తోందా? లేదా మున్సిపల్‌ ఎన్నికలనా? అంటూ విమర్శలు గుప్పించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఏపీ సీఐడీ నోటీసులు వచ్చాయి.. సమాధానమిచ్చా: రఘురామ

విచారణకు హాజరుకావాలంటూ ఏపీ సీఐడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. దీనిపై ఈనెల 16న తాను సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో విచారణకు తనతో పాటు రెండు ప్రముఖ ఛానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. అయినా తన ఒక్కడికే నోటీసులు ఇచ్చారని.. ఇది కోర్టు ధిక్కరణ అవుతుందని తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వైద్యుడి క్రూరత్వం: వీధి శునకాన్ని కారుకు కట్టేసి.. కిలోమీటర్లు లాక్కెళ్లి

ప్రాణాలు కాపాడే గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు.. మూగజీవి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. వీధి శునకాన్ని తన కారుకు తాడుతో కట్టేసి కిలోమీటర్లు లాక్కెళ్లాడు. కారు వేగంతో పరిగెత్తలేక ఆ శునకం తల్లడిల్లిపోయింది. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ శునకాన్ని కారుకు కట్టేసి లాక్కెళ్లిన వీడియో నిన్న సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రద్దీగా ఉన్న రోడ్డులో ఓ వ్యక్తి తన కారుకు శునకాన్ని తాడుతో కట్టేసి వేగంగా పోనిచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని