Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Oct 2022 13:09 IST

1. కేసీఆర్‌ జాతీయ పార్టీ.. చంద్రబాబు ఎలా స్పందించారంటే..

రాజధాని అమరావతిపై రోజుకోమాట వైకాపాకు తగదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి.. రాష్ట్ర ప్రజల సంకల్పం, దేవతల ఆశీర్వాదమని చెప్పారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని సతీసమేతంగా ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు చంద్రబాబు దంపతులకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీపై ప్రకటనపై.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అందుకే ఈ నగరాలకు అమ్మవారి పేర్లు!

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకొనే పండగల్లో 'దసరా' ఒకటి. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆ దుర్గమ్మను మనసారా సేవించడం, ఆ అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతాలను సందర్శించడం పరిపాటే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాల గురించి విన్నారా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఒపెక్‌ సమావేశం వేళ క్రూడాయిల్‌ ధరలకు రెక్కలు!

అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా 90 డాలర్ల దిగువన ట్రేడవుతూ వస్తున్న క్రూడాయిల్‌ ధర మరోసారి పెరిగింది. అంతర్జాతీయంగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 91.91 డాలర్లకు చేరింది. గత సెషన్‌తో పోలిస్తే 2.94 డాలర్లు పెరిగింది. యూఎస్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్‌ ధర కూడా 5 శాతం పెరిగి 86.57 డాలర్లకు చేరింది. గత ముగింపుతో పోలిస్తే ఇది కూడా 2.89 శాతం మేర ఎగిసింది. చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒపెక్‌+ దేశాలు సమావేశం అవుతుండడం ఇందుకు నేపథ్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రివ్యూ: గాడ్‌ ఫాదర్‌

చిరంజీవి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకే కాదు.. ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ ఆసక్తి ఉంటుంది. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ఈ ఏడాది ‘ఆచార్య’ కాస్త గట్టిగానే షాక్ ఇచ్చింది. అయితే, ఈ దసరాకు ‘గాడ్‌ఫాదర్‌’గా తనదైన వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ రీమేక్‌గా మోహన్‌రాజా దీన్ని తెరకెక్కించారు. మరి కింగ్‌ మేకర్‌గా చిరు ఎలా చేశారు? మాతృకతో పోలిస్తే ఏవి మెరుగ్గా ఉన్నాయి? సల్మాన్‌, నయన్‌, సత్యదేవ్‌ పాత్రలు అదనపు ఆకర్షణ తెచ్చాయా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. హెడ్‌ఫోన్లు అతిగా వాడుతున్నారా? కలిగే నష్టాల గురించి తెలుసుకోండి!

ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ ఫోన్‌ ఉంటోంది. దీనికి తగ్గట్టు హెడ్‌ ఫోన్స్‌ తప్పనిసరి అయ్యాయి. చుట్టూ ఎంతమంది ఉన్నా ఫోన్ల ప్రపంచంలోనే అందరూ జీవిస్తున్నారు. సినిమా చూడటం, పాటలు వినడం, ఫోన్ మాట్లాడడం ఇలా పనేదైనా చెవిలో హెడ్‌ ఫోన్స్‌ ఉండాల్సిందే! కానీ దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వారంలో 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు విప్రో సమాచారం

 వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఐటీ దిగ్గజం విప్రో తమ ఉద్యోగులను కోరింది. ఈ విషయాన్ని ఇ-మెయిల్‌ ద్వారా మంగళవారం వారికి తెలియజేసింది. అక్టోబరు 10 నుంచి కార్యాలయాలు తెరిచి ఉంటాయని తెలిపింది. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో.. ఏదైనా మూడు రోజులు ఆఫీసుకు రావొచ్చని పేర్కొంది. బుధవారం మాత్రం కార్యాలయాలు మూసి ఉంచుతున్నట్లు తెలిపింది. హైబ్రిడ్‌ పని విధానాన్ని కొనసాగిస్తూనే ఉద్యోగుల మధ్య అనుబంధం..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పండగ వేళ బంగారం కొనాలనుకునే వారికి చేదు వార్త!

పండగల వేళ బంగారం కొనాలనుకునే వారికి నిజంగా ఇది చేదు వార్త అనే చెప్పాలి. భారత్‌కు చేసే బంగారం సరఫరాలో విదేశీ బ్యాంకులు కోత విధించినట్లు సమాచారం. వారు చైనా, తుర్కియే విపణిపై దృష్టి సారించడమే ఇందుకు కారణం. భారత్‌తో పోలిస్తే ఆ దేశాల నుంచి అధిక లాభాలు వస్తున్నాయని సదరు బ్యాంకులు తెలిపాయి. సాధారణంగానే పండగ సీజన్‌లో భారత్‌లో పసిడికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరఫరాలో కోత విధించడం ఆందోళన కలిగించే విషయం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘అన్‌స్టాపబుల్‌’లో చిరంజీవి.. బాలయ్య రియాక్షన్‌ ఇదే..

నందమూరి బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వస్తున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable). ‘ఆహా’ వేదికగా త్వరలోనే సీజన్‌ 2’ మరి కొన్నిరోజుల్లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2’ ప్రోమో విడుదల చేశారు. గత సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ మరోస్థాయిలో ఉండనుందని బాలయ్య తెలిపారు. అనంతరం ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జెలెన్‌స్కీకి మోదీ ఫోన్‌.. రష్యా గురించి స్పందించిన అమెరికా..!

అంతర్జాతీయ సమాజం నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరింత ఒంటరి అవుతున్నారని అగ్రదేశం అమెరికా వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ కాల్‌ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. మంగళవారం జెలెన్‌స్కీకి ఫోన్ చేసిన మోదీ.. ఉక్రెయిన్‌ యుద్ధానికి సైనిక పరమైన పరిష్కారం లేదన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకడానికి ప్రయత్నం జరగాలని ఇది వరకే తాను పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సూర్యకుమార్‌ ఫామ్‌పై రోహిత్‌ ఫన్నీ కామెంట్‌!

టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా స్థానం సంపాందించుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల గువాహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఫోర్లు, సిక్సర్లతో సఫారీలపై విరుచుకుపడ్డాడు. అంతకుముందు హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ యువ ఆటగాడు రాణించాడు. తాజాగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరదా వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని