Godfather review: రివ్యూ: గాడ్ ఫాదర్
Godfather review: చిరంజీవి, సల్మాన్ కీలక పాత్రల్లో నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా ఎలా ఉందంటే?
Godfather review: చిత్రం: గాడ్‌ఫాదర్; నటీనటులు: చిరంజీవి, సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరిజగన్నాథ్, మురళీశర్మ తదితరులు; సంగీతం: ఎస్ఎస్ తమన్; సినిమాటోగ్రఫీ: నీరవ్ షా; ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్; నిర్మాత: రామ్‌చరణ్, ఆర్బీ చౌదరి. ఎన్వీ ప్రసాద్; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్‌రాజా; విడుదల: 05-10-2022
చిరంజీవి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకే కాదు.. ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ ఆసక్తి ఉంటుంది. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ఈ ఏడాది ‘ఆచార్య’ కాస్త గట్టిగానే షాక్ ఇచ్చింది. అయితే, ఈ దసరాకు ‘గాడ్‌ఫాదర్’గా తనదైన వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌గా మోహన్‌రాజా దీన్ని తెరకెక్కించారు. మరి కింగ్ మేకర్‌గా చిరు ఎలా చేశారు? (Godfather review) మాతృకతో పోలిస్తే ఏవి మెరుగ్గా ఉన్నాయి? సల్మాన్, నయన్, సత్యదేవ్ పాత్రలు అదనపు ఆకర్షణ తెచ్చాయా?
కథేంటంటే: రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.రామదాసు (పీకేఆర్) మరణం తర్వాత రాజకీయ శూన్యం ఏర్పడుతుంది. సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై జన జాగృతి పార్టీ (జేజేపీ) తర్జనభర్జన పడుతుంటుంది. పీకేఆర్ స్థానంలో అధికారాన్ని హస్తగతం చేసుకుని సీఎం కావాలని అతడి అల్లుడు జైదేవ్ (సత్యదేవ్) భావిస్తాడు. అందుకు పార్టీలోని కొందరు దురాశపరులతో చేతులు కలుపుతాడు. అయితే, పీకేఆర్‌కు అత్యంత సన్నిహితుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు బ్రహ్మ తేజ (చిరంజీవి) మాత్రం జైదేవ్ సీఎం కాకుండా అడ్డు నిలబడతాడు. జన జాగృతి పార్టీ నుంచి, అసలు ఈ లోకం నుంచే బ్రహ్మను పంపించడానికి జైదేవ్ కుట్రలు పన్నుతాడు. మరి ఆ కుట్రలను బ్రహ్మ ఎలా ఎదుర్కొన్నాడు? జైదేవ్ నీచుడన్న విషయం జైదేవ్ భార్య సత్యప్రియ (నయనతార)కు ఎలా తెలిసింది? రాష్ట్ర పాలన దురాశపరుల చేతిలో పడకుండా బ్రహ్మ ఎలా అడ్డుకున్నాడు? ఇంతకీ బ్రహ్మకు, పీకేఆర్‌కు ఉన్న సంబంధం ఏంటి? (Godfather review) మధ్యలో మసూద్ భాయ్ (సల్మాన్) ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: ‘‘గాడ్ ఫాదర్’ స్క్రీన్‌ప్లే కొత్తగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి. ఇవన్నీ సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఓపిక ఉంటే ‘లూసిఫర్’ని మరోసారి చూసి రండి’’ - ఇదీ ఇటీవల ఇంటర్వ్యూలో దర్శకుడు మోహన్‌రాజా చెప్పిన విషయం. తన స్క్రీన్‌ప్లే, మార్పులపై ఎంత నమ్మకంతో చెప్పారో దాన్నే తెరపై చూపించడంలో విజయం సాధించారు దర్శకుడు. ‘లూసిఫర్’ చూసిన వాళ్లు కూడా ‘గాడ్‌ఫాదర్’ను ఎంజాయ్ చేస్తారు. పీకేఆర్ మరణంతో సినిమా మొదలు పెట్టిన దర్శకుడు, కొద్దిసేపటికే అసలు కథేంటి? సినిమాలో పాత్రల తీరుతెన్నులు వివరంగా చెప్పేశారు. ఇక ప్రేక్షకుడు చూడాల్సింది తెరపై కనిపించే రాజకీయ చదరంగమే.
ఈ చదరంగంలో రెండు బలమైన పావులుగా ఒకవైపు బ్రహ్మగా చిరంజీవి, జైదేవ్‌గా సత్యదేవ్‌లు నిలబడ్డారు. ఒక్కో సన్నివేశంలో ఒక్కొక్కరిది పై చేయి ఉంటుంది. అయితే, బ్రహ్మ పాత్ర కీలకం కావడంతో అంతర్లీనంగా అతడే ఒక మెట్టుపైన ఉంటాడు. (Godfather review) చిరంజీవి కనిపించే ప్రతి సన్నివేశమూ ఆయన్ను ఎలివేట్ చేసిన విధానం స్టైలిష్‌గా బాగుంది. ఆ సన్నివేశాలకు తమన్ నేపథ్యం సంగీతం థియేటర్‌ను ఓ ఊపు ఊపేసింది.
జన జాగృతి పార్టీ పగ్గాలు బ్రహ్మ చేపట్టకుండా జైదేవ్, అతడి మద్దతుదారులు చేసే పయత్నాలు, వాటిని బ్రహ్మ తిప్పి కొట్టడం ఇలా ప్రతి సన్నివేశమూ నువ్వా-నేనా అన్నట్లు ప్రథమార్ధం సాగుతుంది. విరామ సన్నివేశానికి ముందు జైలులో చిరు ఫైట్, సంభాషణలు అభిమానులు మెచ్చేలా ఉన్నాయి. ఆ తర్వాత సల్మాన్ రాకతో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అసలు బ్రహ్మ ఎవరు? మసూద్ గ్యాంగ్ అతడిని ఎందుకు సపోర్ట్ చేస్తుంది? జైదేవ్ కుట్రలను బ్రహ్మ ఎలా ఛేదించుకుంటూ వచ్చాడు? ఇలా ద్వితీయార్ధం ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో సాగుతుంది. ప్రథమార్ధంలో ఉన్నంత డ్రామా, ఎలివేషన్స్ ద్వితీయార్ధానికి వచ్చే సరికి కాస్త రొటీన్ అనిపిస్తాయి. (Godfather review) పతాక సన్నివేశాల్లో పెద్దగా మెరుపులేవీ ఉండవు. అయితే, ఒకవైపు చిరంజీవి, మరోవైపు సత్యదేవ్‌లు తమ నటనతో అవి కనిపించకుండా చేశారు. ప్రతి సన్నివేశాన్నీ చిరు అభిమానులు మెచ్చేలా మోహన్‌రాజా తీర్చిదిద్దారు. హీరోయిజం ఎలివేట్ అయ్యేలా యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది.
ఎవరెలా చేశారంటే: బ్రహ్మతేజ పాత్రలో ప్రజాదరణ కలిగిన నాయకుడిగా, మాస్ హీరోగా చిరంజీవి ఒదిగిపోయారు. తన అనుభవాన్ని అంతా రంగరించి చాలా సెటిల్డ్‌గా నటించారు. ఇక్కడ మోహన్‌లాల్ నటనతో చిరంజీవి నటన పోల్చాల్సిన అవసరం లేదు. ఇద్దరూ అగ్ర కథానాయకులే. ఎవరి నటనా ప్రతిభ వారిది. ప్రతినాయకుడు జైదేవ్‌గా సత్యదేవ్ మెప్పించారు. స్టైలిష్ విలనిజం చూపించారు. సినిమాలో సత్యదేవ్ ఎక్కడా కనిపించలేదు. జైదేవ్‌గా అధికార దాహం కలిగిన విలన్‌గా ఒదిగిపోయారు. నయనతార, మురళీశర్మ, సునీల్, బ్రహ్మాజీ వారి పాత్రలకు న్యాయం చేశారు. పూరి జగన్నాథ్, షఫీ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమన్ సంగీతం ఓకే. నేపథ్య సంగీతంతో సినిమాను ఎలివేట్ చేయడంలో అతడికి అతడే సాటి. చిరు పరిచయ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. (Godfather review) నీరవ్ షా సినిమాటోగ్రఫీ డీసెంట్. మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి రచయిత లక్ష్మీ భూపాల. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో చిరు పలికిన సంభాషణలు ఆకట్టుకోగా.. థియేటర్లో విజిల్స్ వేయించాయి. వర్తమాన రాజకీయాలపై వేసిన సెటైర్లు బాగున్నాయి. చిరంజీవి అభిమానులు ఏం కోరుకుంటారో వాటన్నింటినీ రంగరించి దర్శకుడు మోహన్‌రాజా ‘లూసిఫర్’ను రీమేక్ చేశారు. దసరా సెలవుల్లో ‘గాడ్‌ఫాదర్’ మాస్ ఎంటర్టైనర్గా అలరిస్తాడు.
బలాలు
+ చిరంజీవి, సత్యదేవ్‌ల నటన
+ దర్శకత్వం
+ తమన్ నేపథ్య సంగీతం
బలహీనతలు
- ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
- రొటీన్ క్లైమాక్స్
చివరిగా: గాడ్‌ఫాదర్.. మాస్ బుల్డోజర్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే?
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్‌కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?