Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 16 Feb 2023 12:59 IST

1. Kanna Laxminarayana: భాజపాకు కన్నా లక్ష్మీనారాయణ గుడ్‌బై

భాజపా (BJP)కు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxminarayana) గుడ్‌ బై చెప్పారు. గురువారం గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం తన రాజీనామాను ప్రకటించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడనున్నారు. గత కొంతకాలంగా భాజపా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. నేడు పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. IND vs AUS: భారత్ X ఆసీస్‌.. రెండో టెస్టులో రికార్డుల మోత మోగేనా..?

ఆస్ట్రేలియాతో (Ind vs Aus) రెండో టెస్టు కోసం భారత్‌ సన్నద్ధమవుతోంది. నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీలో 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్‌ (Team India).. రెండో టెస్టులోనూ విజయం సాధించి ముందడుగు వేయాలని ఆశిస్తోంది. ఇప్పటికే టెస్టుల్లోనూ అగ్రస్థానానికి దూసుకొచ్చిన భారత్‌.. అదే స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. Kanna Laxminarayana: సోము వీర్రాజు ప్రవర్తన నచ్చకే భాజపాకు రాజీనామా: కన్నా

గుంటూరు: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడినై భాజపా(BJP)లో చేరానని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxminarayana) చెప్పారు. చేరినప్పటి నుంచి సామాన్య కార్యకర్తగా పనిచేశానని.. దాన్ని గుర్తించే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) ప్రవర్తన బాగాలేకనే భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

4. Pakistan: ఐఎంఎఫ్‌ మెప్పు కోసం పాక్‌ పాకులాట.. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.272కు పెంపు!

భారీ పన్నుల వడ్డనతో కూడిన మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన గంటల్లోనే పాకిస్థాన్‌ (Pakistan) ప్రభుత్వం పెట్రో ధరలను కూడా గణనీయంగా పెంచింది. దీంతో అక్కడి పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరాయి. ఐఎంఎఫ్‌ (IMF)ను ఒప్పించి బెయిలవుట్‌ ప్యాకేజీలో భాగంగా తొలి విడత రుణసాయాన్ని విడుదల చేయించుకునే వ్యూహంతోనే ధరల్ని అమాంతం పెంచింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. US: అమెరికాలో మళ్లీ పేలిన తూటా..

అగ్రదేశం అమెరికా(America)లో వరుసగా తుపాకీ  కాల్పుల ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. తాజాగా టెక్సాస్(Texas) రాష్ట్రం కాల్పులతో దద్దరిల్లింది. ఎప్‌ పాసో ప్రాంతంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో బుధవారం సాయంత్రం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. Tripura Election: రెండోసారి భాజపాను విజయం వరించేనా..? త్రిపురలో కొనసాగుతోన్న పోలింగ్

ఈశాన్య భారత్‌లోని త్రిపుర(Tripura)లో అసెంబ్లీ ఎన్నికల(Assembly Election ) పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 60 నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ గురువారం ఉదయం ఓటింగ్‌ ప్రారంభమైంది. ఉదయం ఏడింటికి మొదలైన పోలింగ్‌.. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుందని ప్రధాన ఎన్నికల అధికారి(CEO) వెల్లడించారు. ఉదయం 9 గంటల సమయానికి 13.23శాతం పోలింగ్‌ జరిగింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. IND vs AUS: మీకు అలాంటి లెఫ్ట్‌ఆర్మ్‌ బౌలర్‌ తెలిస్తే చెప్పండి: జర్నలిస్ట్‌లకు ద్రవిడ్‌ సూచన

శుక్రవారం నుంచి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా కోచ్ రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) ప్రెస్ కాన్ఫెరెన్స్‌ నిర్వహించాడు. షాహీన్‌ షా అఫ్రిది, మిచెల్‌ స్టార్క్‌ వంటి స్టార్ బౌలర్లను ఉదాహరణగా తీసుకుంటూ.. భారత జట్టులో లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్ల పరిస్థితిపై ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు రాహుల్‌ తెలివిగా సమాధానం ఇచ్చాడు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. USA: ఒహాయోను వణికిస్తున్న రైలు ప్రమాదం.. వాతావరణం విషపూరితం

అమెరికాలోని ఒహాయోలో ఇటీవల ఓ గూడ్స్‌ రైలు బోల్తాపడింది. ఇప్పుడు ఆ ప్రమాదం కారణంగా అత్యంత ప్రమాదకరమైన గ్యాస్‌లు వాతావరణంలో కలిశాయి. దీంతో అక్కడి ప్రజలు బాటిల్‌ నీటినే తాగాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ మైక్‌ డివైన్‌ కోరారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. నువ్వే తోశావ్‌.. కాదు నువ్వే తోశావ్‌: ఎమ్మెల్యే, మహిళా పోలీసు ఘర్షణ

దిల్లీ: ఉన్నతస్థాయి విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రజాసేవకులు సహనం కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం మధ్యలో ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా ఒకరి మీద మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఒడిశా( Odisha) భాజపా ఎమ్మెల్యే జయనారాయణ్‌ మిశ్రా( Jaynarayan Mishra) కాగా, మరొకరు ధనుపాలి(Dhanupali) పోలీస్‌ స్టేషన్ ఇన్‌ఛార్జి అనితా ప్రధాన్‌(Anita Pradhan). వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. OTT Movies: ఈ వారం ఓటీటీలో ఎనిమిది సినిమాలు. తొమ్మిది వెబ్‌సిరీస్‌లు.. ఇంకా ఎన్నో..!

OTT Movies: ఫిబ్రవరిలో మూడో వారంలోనూ వరుస చిత్రాలు థియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధమవగా, ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. అవేంటో చూద్దామా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని