Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Aug 2021 09:28 IST

1. ఆమె వెనక అతను

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పతక పోరులో గెలవగానే ఒక్కసారిగా సింధు విజయ నాదం చేసింది. ఆ వెంటనే అక్కడున్న కెమెరాలన్నీ కోర్టు బయట ఓ మూల వైపు తిరిగాయి. అప్పటికే అక్కడ ఓ వ్యక్తి పట్టరాని సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నాడు. అతని దగ్గరికి వెళ్లిన సింధు.. ‘‘మనం సాధించాం’’ అనే అర్థం వచ్చేలా అతణ్ని హత్తుకుంది. అతనెవరో కాదు.. పార్క్‌ తే సంగ్‌.. సింధు కోచ్‌. కొన్నేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలంగా ఈ పతకం ఆమెకు దక్కడంతో 42 ఏళ్ల పార్క్‌ ఆనందం పట్టలేకపోయాడు. సింధు విజయం వెనక అతనిది కీలక పాత్ర. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అనితర సాధ్యురాలు

2. టిక్కెట్ ధరల బాదుడు

ప్యాసింజర్‌ రైళ్ల టిక్కెట్టు ధరల్ని అమాంతం పెంచేశారు. పేదవారిపై భారం మోపిఆదాయం పెంచుకోవాలని వాల్తేరు రైల్వే చూస్తోంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 4ప్యాసింజర్‌ రైళ్లనూ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి కేవలం కౌంటర్లలో మాత్రమే టిక్కెట్లనిస్తోంది. అలాంటప్పుడు రిజర్వేషన్‌ ఛార్జీలు, అదనపు భారం ఎందుకని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇలా కొన్ని ప్రాంతాలకు రెండింతలు, మరికొన్ని చోట్లకి మూడింతలుగా సాధారణ టిక్కెట్‌ ధరల్ని పెంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హానికర వైరస్‌ గుట్టు పట్టేస్తుందిక!

హానికర వైరస్‌లు, బ్యాక్టీరియా సహా గాలి ద్వారా సోకే అంటువ్యాధులపై పరిశోధనలకు మార్గం సుగమం కానుంది. అధునాతన సదుపాయాలతో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో బయోసేఫ్టీ లెవల్‌(బీఎస్‌ఎల్‌)-3 ల్యాబ్‌ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. దేశంలోనే తొలిసారిగా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ఇలాంటి ప్రయోగశాల మొదలు కానుండటం విశేషం. బీఎస్‌ఎల్‌-3తోపాటు ఏబీఎస్‌ఎల్‌(యానిమల్‌ బయోసేఫ్టీ లెవల్‌)-3 ల్యాబ్‌నూ ఇక్కడ సిద్ధం చేస్తుండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
4. కమ్మేస్తున్న డెల్టా!

కొవిడ్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తిరగబెడుతోంది. ప్రధానంగా సాంక్రమిక శక్తి అత్యంత ఎక్కువ ఉన్న డెల్టా రకం కరోనా వైరస్‌ కమ్మేస్తోంది. దీని దెబ్బకు ఇప్పుడు ‘డ్రాగన్‌’ అల్లాడుతోంది. చైనా వ్యాప్తంగా 18 ప్రావిన్సుల పరిధిలోని 27 నగరాలకు వ్యాపించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అనేక నెలలుగా కొవిడ్‌ కట్టడిలో విజయవంతమైన చైనాను తాజా ఉద్ధృతి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మధ్యస్థాయి, తీవ్ర ముప్పు ఉన్న ప్రాంతాల సంఖ్య 95కి పెరిగినట్లు అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Coronavaccine: టీకా వేయించుకుంటే.. షాపింగ్‌ వోచర్లు.. పిజ్జా డిస్కౌంట్లు

5. రాళ్లు రువ్వితే ఉద్యోగమివ్వరు

రాళ్లు రువ్వినా, విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొన్నా.. అలాంటివారికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చేయాలని జమ్మూ-కశ్మీర్‌ పోలీసు విభాగం ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి వారికి పాస్‌పోర్ట్‌లు కూడా జారీ చేయకూడదని పేర్కొంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యవహారాల్లో పాల్గొనే వారు ఇకపై విదేశాలకు వెళ్లే అవకాశమే ఉండదని స్పష్టంచేసింది. ఈ మేరకు సీఐడీ స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చైనా దన్నుతో పాక్‌ మరో పన్నాగం!

పాకిస్థాన్‌ మరో కుట్రకు శ్రీకారం చుట్టింది. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌కు ప్రావిన్షియల్‌(రాష్ట్ర) హోదా ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. ఈ ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు కూడా పూర్తయినట్లు పాక్‌ పత్రిక ‘డాన్‌’ పేర్కొంది. ప్రావిన్షియల్‌ హోదాను భారత్‌ ఆది నుంచీ వ్యతిరేకిస్తోంది. చట్ట ప్రకారం జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ కూడా భారత్‌లో అంతర్భాగమేనని పాక్‌కు గతంలో ఎన్నోసార్లు స్పష్టం చేసింది. ఈ ఆక్రమిత ప్రాంతాన్ని అధికారికంగా తన భూభాగంలోకి కలుపుకొనేందుకు కొన్నాళ్లుగా పాక్‌ ప్రణాళికలు రచిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐఐటీ బాటలో తుది పరీక్ష!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2021 షెడ్యూల్‌ విడుదలైంది. ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పించే పరీక్ష ఇది. గత సంవత్సరం ఐఐటీ-దిల్లీ ఈ పరీక్షను సెప్టెంబరు 27న  నిర్వహిస్తే.. ఈ ఏడాది ఐఐటీ-ఖరగ్‌పూర్‌ అక్టోబరు 3న నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించే ప్రణాళికను తెలుసుకుందాం! జేఈఈ-మెయిన్‌-2021 చివరి షెడ్యూల్‌ ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 2 వరకు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆన్‌లైన్‌ ప్రవేశాలు..ఆందోళనలో తల్లిదండ్రులు!

8. నిరుపేదల చిరునవ్వు కోసమే ఈ తపన!

మన చుట్టూ బోలెడు సమస్యలు కనిపిస్తుంటాయి... చాలావరకూ చూసీ చూడనట్లు వదిలేస్తాం.  అప్పటికీ మనసు కదలిస్తే...ఓ పదోపరకో ఇచ్చి సంతృప్తి పడిపోతాం.  అవి మాత్రమే సరిపోవనుకుంది హైదరాబాద్‌ కి చెందిన అర్చన... 2013లో ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌ ఫౌండేషన్‌’ను ప్రారంభించి... నిరుపేదల సమస్యలకు పరిష్కారాలు చూపిస్తోంది. ఉపాధి మార్గాలను అందిస్తోంది. విద్యార్థులకు విద్యను కానుకగా ఇస్తోంది. ఆమెతో వసుంధర ముచ్చటించింది. ఆ వివరాలే ఇవి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అందమే పెట్టుబడిగా మహిళలపై వల

అతడో అందగాడు. తన అందంతో వల విసురుతాడు. ఫేస్‌బుక్‌, షేర్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులు, మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారి అర్ధనగ్న చిత్రాలు తీసుకున్న తర్వాత అసలు రూపం బయటపెడతాడు. పరువు పోతుందని మహిళలు అతను అడిగినంత డబ్బులు, నగలు ఇచ్చేవారు. ఈ మోసగాడిని కడప తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1.26 లక్షల నగదు, 30 గ్రాముల నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. కడప డీఎస్పీ సునీల్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎవరిదీ కంకరబుద్ధి?

10. అమ్మ కడుపు హాయిగా

రాష్ట్రంలో కాన్పు కోతలను నివారించడంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. సహజ ప్రసవాలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ‘మిడ్‌వైఫరీ నర్సింగ్‌’ శిక్షణకు ప్రాధాన్యమిస్తోంది. ప్రయోగాత్మకంగా 11 ఆసుపత్రులను ఎంపిక చేసి.. వాటిలో సుమారు 219 మంది మిడ్‌వైఫరీ నర్సులను నియమించింది. వీరితో పాటు ఈ ఆసుపత్రులకు సమీపంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లోని నర్సులకూ సహజ ప్రసవాలపై శిక్షణ ఇస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని