Updated : 28 Jun 2022 09:11 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. దుర్భేద్యంగా హెచ్‌ఐసీసీ

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన దృష్ట్యా రాష్ట్ర పోలీసుశాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానితోపాటు 40 మంది కేంద్ర ప్రముఖులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, వందల మంది పార్టీ నాయకులు రెండు రోజులపాటు నగరంలో బసచేయనుండటంతో వారి భద్రతను అధికారులు సవాలుగా తీసుకుంటున్నారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకూ తావులేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ పోలీసు శాఖ నిమగ్నమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎప్పుడైనా కేసులే కదా.. రండి తేల్చుకుందాం

‘అధికారంలోకి వస్తే అక్రమాలపై తేలుస్తామని చెబుతున్నావు.. రంగంలోకి ఎప్పుడు దిగుతావు.. ఎప్పుడు వస్తావు.. కాళ్లు చేతులు విరుస్తామని ఆరు నెలలుగా చెబుతున్నావు.. చావడానికి.. చంపుకోవడానికి అధికారం ఎందుకు? ఎప్పుడైనా కేసులే కదా.. రా..’ అంటూ పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఉద్దేశించి శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ధర్మవరంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి వైకాపా ప్లీనరీ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వాలంటీరు పోస్టులిచ్చింది.. మన పార్టీ వారికే కదా

3. బుమ్రాకు అరుదైన అవకాశం?

టీమ్‌ఇండియా ప్రధాన ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు అరుదైన అవకాశం దక్కుతుందా? మూడున్నర దశాబ్దాల్లో భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి పేసర్‌గా అతను నిలుస్తాడా? అంటే.. అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో శుక్రవారం ఆరంభమయ్యే అయిదో టెస్టు కోసం టీమ్‌ఇండియా సారథ్యాన్ని అతనికే అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడడంతో ఈ కీలక మ్యాచ్‌లో జట్టును నడిపించే బాధ్యతలు బుమ్రాకే కట్టబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పోచారంలో స్వగృహ ఇళ్లు కొనండి

హెచ్‌ఎండీఏ అధికారులు ఓ వైపు పోచారం, బండ్లగూడలోని రాజీవ్‌ స్వగృహ ఇళ్లకు లాటరీ తీస్తున్నారు. మరోవైపు ఇళ్లు కొనేందుకు పేర్లు ఇవ్వాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌.. ఉద్యోగులను ఆదేశించారు. దీనిపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. బహిరంగ నోటిఫికేషన్‌ ద్వారా పౌరుల నుంచి హెచ్‌ఎండీఏ వేలాదిగా దరఖాస్తులు స్వీకరించింది. మరోవైపు ఇళ్లు కొనేందుకు ముందుకురావాలని బల్దియా ఉన్నతాధికారులు యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారుల ద్వంద్వ వైఖరిపై దరఖాస్తుదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నాకు మంచి భార్య కావాలి!

పెళ్లి చేయడానికి తమ కుమారుడు/కుమార్తెల ఫొటోలను తల్లిదండ్రులు మ్యాట్రిమోనీ సంస్థలకు ఇస్తుంటారు. తెలిసిన వారికి, మధ్యవర్తులకు సైతం అందజేస్తుంటారు. కానీ... తమిళనాడులోని మదురై నగరం విల్లుపురంలో ‘నాకు మంచి భార్య కావాలి’ అనే పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఎవరు వీటిని అతికించారు. అసలేంటీ కథ...? విల్లుపురం వాసి జగన్‌ ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు 27 ఏళ్లు. అయిదేళ్లుగా పెళ్లి కోసం సంప్రదాయ విధానంలో ప్రయత్నించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

డ్రైవర్‌ మద్యం సేవిస్తే.. బండి మొండికేస్తుంది!

6. ‘అమ్మఒడి’ ల్యాప్‌టాప్‌లకు మంగళం

అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు అందిస్తామన్న ల్యాప్‌టాప్‌లకు ప్రభుత్వం మంగళం పాడింది. బహిరంగ మార్కెట్‌లో వీటి ధర పెరగడంతో పంపిణీని నిలిపివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 9-12 తరగతులు చదివే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని, కావాలనుకునే వారు ఐచ్ఛికాలు ఇవ్వాలని గతేడాది పాఠశాల విద్యాశాఖ కోరింది. దీంతో సుమారు ఏడు లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఒక్కో ల్యాప్‌టాప్‌ను రూ.18 వేలు కొనుగోలు చేయాలని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌కు ప్రభుత్వం సూచించింది. ఏపీటీఎస్‌ టెండర్లు నిర్వహించగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తుని చెంతన పులి కలకలం

ఇన్నాళ్లూ అటవీ ప్రాంతంలో సంచరించి, రెండు రోజులుగా ఆనవాళ్లు లేకుండాపోయిన పెద్దపులి సోమవారం రాత్రి పాదముద్ర ద్వారా ప్రజలు, అధికారులను ఉలికిపాటుకు గురిచేసింది. తుని మండలంలో కొండల మాటున పాదముద్రలు కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో కలవరం మొదలైంది. సోమవారం రాత్రి సమయంలో కొలిమేరు-కుమ్మరిలోవ సమీపంలోని కుచ్చర్లకొండ వద్ద పెద్దపులి రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా ఆటుగా వెళ్తున్న ప్రైవేటు బస్సులోని ప్రయాణికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు ప్రణాళిక రచన నుంచి సాక్ష్యాధారాల ధ్వంసం వరకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర అని మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. ‘తన తండ్రి హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని అప్పటి డీజీపీని సునీత కలిసినప్పుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌.అవినాష్‌రెడ్డి కళ్లు లాంటి వారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు డీజీపీ ఆమెకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సన్నిహితులకే ‘కిక్కు!’

9. అగ్నిపర్వతం మీదుగా హెలికాప్టర్‌ నడిపా!

పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగరాలన్నది ఆమె కల. అందుకోసం హెలికాప్టర్‌ పైలట్‌ అవ్వాలనుకుంది. ఇంట్లో వాళ్లు వారించారు.. తోటి వాళ్లు చేయలేవన్నారు.. మన దేశంలో నేర్చుకునే అవకాశం లేదు.. ఇవేవీ తనను ఆపలేక పోయాయి. ప్రతి దశలోనూ తానేంటో నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది క్రితి గరుడ. దేశం నుంచి తొలి మహిళా సివిలియన్‌ హెలికాప్టర్‌ పైలట్‌ తను. పురుషాధిక్య రంగంలో తను సాధించాల్సింది ఇంకా ఉందంటున్న ఈ వైజాగ్‌ అమ్మాయి వసుంధరతో తన కలల ప్రయాణాన్ని పంచుకుందిలా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Reunite: యవ్వనంలో విడిపోయి.. వృద్ధాప్యంలో ఒక్కటై..

యవ్వనంలో విడిపోయిన ఓ జంట.. వృద్ధాప్యంలో మళ్లీ ఒక్కటైంది. దాదాపు యాభైయ్యేళ్ల క్రితం విడాకులు తీసుకున్న దంపతులు ఇప్పుడు మళ్లీ కలిసి జీవించాలనుకుంటున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లాలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో ఈ వృద్ధ జంటను జడ్జీలు మళ్లీ కలిపారు. బాసప్ప (85), కల్లవ (80) అనే వీరు పెళ్లైన కొద్ది సంవత్సరాలకే మనస్పర్థల కారణంగా 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి బాసప్ప ఆమెకు ప్రతినెలా భరణం చెల్లిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని