Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Jan 2023 09:11 IST

1. ఇంటర్‌లో కొత్తగా సీఈఏ గ్రూపు

ఇంటర్‌మీడియట్‌ విద్యలో కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి రానుంది. అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ ఈ గ్రూపును వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్‌, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉండనున్నాయి. సీఈఏ గ్రూపుగా పిలవనున్నారు. ‘‘ఇంటర్‌స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందిస్తున్నాం.  బోర్డు సమావేశం ఆమోదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చిన్న రాష్ట్రాలు.. భారీ అంచనాలు

మామూలుగానైతే త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు అంతగా ప్రాచుర్యం పొందవు. వచ్చేనెలలో జరిగే ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలపై ఈసారి యావద్దేశం దృష్టిసారిస్తోంది. కారణం- దేశంలో రాబోయే ఏడాదిన్నర పాటు సాగే ఎన్నికల కోలాహలానికి ఈ ఈశాన్య భారతమే శ్రీకారం చుట్టబోతోంది. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీలకు ఫిబ్రవరిలో జరిగే పోలింగ్‌తో దేశంలో ఎన్నికల హడావుడి ఆరంభమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎయిర్‌టెల్‌ కనీస రీఛార్జి రూ.155

భారతీ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ కనీస రీఛార్జిని దాదాపు 57 శాతం పెంచి  రూ.155 చేసింది. ప్రస్తుతం ఉన్న కనీస రీఛార్జి ప్లాన్‌ రూ.99ను నిలిపి వేసింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ పశ్చిమ, జమ్మూ కశ్మీర్‌, రాజస్థాన్‌, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ ప్రదేశ్‌ సర్కిళ్లలో ఇకపై రూ.155 కనీస ధర అమలవుతుంది. రూ.99 పథకం కింద 200 ఎంబీ డేటా ఉచితం కాగా, కాల్‌కు సెకనుకు రూ.2.5 పైసా అయ్యేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కన్నా మౌనం దేనికి సంకేతం?

భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది దేనికి సంకేతం అని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య దిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశానికి మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలో కొనసాగటంపైనా సస్పెన్స్‌ కొనసాగుతోంది. కుటుంబంలో శుభకార్యం ఉండటంతో రాలేకపోయాయని జాతీయ సమావేశానికి రాలేకపోయానని కేంద్ర నాయకత్వానికి తెలియజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాట్సప్‌లో ‘ఒరిజినల్‌’ ఫొటో షేరింగ్‌

వాట్సప్‌లో ఫొటోలను షేర్‌ చేసుకుంటూనే ఉంటాం. కాకపోతే ఇవి కంప్రెస్‌ అయ్యాక షేర్‌ అవుతాయి. దీంతో ఒరిజినల్‌ క్వాలిటీలో ఫొటోలను షేర్‌ చేయటం సాధ్యం కాదు. ఇకపై అలాంటి ఇబ్బందేమీ ఉండదు. త్వరలో ఒరిజినల్‌ క్వాలిటీలో ఫొటోలను షేర్‌ చేసుకునే సదుపాయం అందుబాటలోకి రానుంది. ఆండ్రాయిడ్‌ 2.23.2.11 అప్‌డేట్‌తో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నారు. డ్రాయింగ్‌ టూల్‌ హెడర్‌లోనే ఈ కొత్త సెటింగ్‌ గుర్తు కనిపిస్తుంది. దీని ద్వారా ఇమేజ్‌ క్వాలిటీని నిర్ణయించుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. త్వరలో మెట్రో ఛార్జీల పెంపు

మెట్రో ఛార్జీలపై ‘ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ’ అధ్యయనం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపు ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు ఆర్థికంగా ప్రాజెక్ట్‌ పునర్నిర్మాణామంపై ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ దృష్టి పెట్టింది. ఆదాయం పెంచుకోవడంతోపాటు ప్రాజెక్ట్‌ను లాభదాయకంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. మెట్రో నిర్మాణ ఖర్చు మొత్తం రూ.13 వేల కోట్లు ఎల్‌ అండ్‌ టీ సంస్థనే భరించింది. బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణం తీసుకుంది.  లాక్‌డౌన్‌తో నష్టాల్లోకి కూరుకుపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇంతింతై.. ప్రపంచమంతై!

సాఫ్ట్‌వేర్‌ రంగంలో జిల్లాకు చెందిన వేలాది మంది పని చేస్తున్నారు. రూ.లక్షల్లో వేతనం సంపాదిస్తున్నారు. వీరు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. పైకి ఎదుగుతూనే గుర్తింపు వస్తుందని భావించి కష్టపడ్డారు. ఒకరైతే కంపెనీ తరఫున ఏడు దేశాల్లోని ఉద్యోగులకు హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరికొందరు స్వతహాగా కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే తాము పుట్టి పెరిగిన ఆదిలాబాద్‌ గడ్డను మరవకుండా ఇక్కడ వారికి సైతం ఉద్యోగాలు కల్పించేందుకు  ముందుకొస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒక్కో సీటుకు ₹లక్షపైనే వసూలు!

అభ్యర్థుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు బీఎడ్‌ కళాశాలల యాజమాన్యాలు తమ కోటా సీట్లను రూ.లక్షల్లో కట్టబెడుతూ కొత్తరకం దోపిడీకి తెరలేపాయి. పొరుగు జిల్లాల్లో రూ.వేలు వెచ్చిస్తేనే సీటు లభిస్తుంటే ఇక్కడ మాత్రం అభ్యర్థుల జేబులను గుల్లచేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. డబ్బులు చెల్లించి ప్రవేశం పొందాక అసలు విషయం తెలిసి అవాక్కవడం అభ్యర్థుల వంతవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆదర్శం.. రూ.1కే అంత్యక్రియల పథకం

‘రూపాయికే అంత్యక్రియల పథకం’ పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది. కరీంనగర్‌ నగర పరిధిలో పేదలు, అనాథలు ఎవరు చనిపోయినా సరే నగర పాలిక ద్వారానే రూ.1తో దహన సంస్కారాలు చేస్తున్నారు. ‘రూపాయి’ పథకాన్ని 2019 జూన్‌ 15న ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. స్థానికేతరుల ప్రయోజనార్థ్థం కొత్త సంస్కరణ చేపట్టారు. పూర్తి వివరాలతో కథనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విలువ తగ్గిస్తే అసలుకే ఎసరు

సరకు రవాణా, కొరియర్‌ సేవల్లో సంస్థలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్న కొందరు వ్యాపారులకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. రవాణా సమయంలో సరకుపోయినా, దొంగతనం జరిగినా, దెబ్బతిన్నా పూర్తి స్థాయి నష్టపరిహారం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా చేసే ఉత్పత్తుల విలువ తక్కువగా చూపి మభ్యపెడుతూ బిల్లు తక్కువ చెల్లిస్తుండటంతో నష్టపరిహారం పొందక.. ఒకవేళ వచ్చినా అదే పరిమాణంలో వస్తుండటంతో రూ.లక్షలు నష్టపోవాల్సి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని