Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Apr 2023 09:21 IST

1. అర్ధరాత్రి హలీమ్‌.. అదే షాన్‌

రంజాన్‌ మాసంతోపాటే నగరంలో హలీమ్‌ సందడి మొదలైంది. విభిన్న రుచులతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు వినూత్నంగా హలీమ్‌ వంటకాలను పరిచయం చేస్తున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి మొదలుకొని తెల్లవారుజాము వరకు విక్రయాలు జరుపుతుండటంతో నగరవాసులు అర్ధరాత్రి వేళ హలీమ్‌ రుచి చూడటానికి వెళ్తున్నారు. విక్రయ కేంద్రాలు రాత్రిళ్లు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము 4గంటల వరకు రద్దీ ఉంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎన్నిక ఏదైనా ‘శాసించేది వారే!’

కర్ణాటక చరిత్రలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన సామాజిక వర్గమది. 9 శతాబ్దాల క్రితమే సమాజంలో నెలకొన్న వివక్షకు, కరడుగట్టిన సంప్రదాయాలకు వ్యతిరేకంగా గళమెత్తి బడుగు వర్గాలకు అండగా నిలిచింది. బసవన్న  ఆదర్శాలతో సకల వర్గాల ఆదరణను చూరగొంది. లింగాయత్‌ లేదా వీరశైవ లింగాయత్‌లుగా పేరొందిన ఈ సామాజిక వర్గం ఆధునిక రాజకీయాల్లోనూ తనదైన విశిష్టతను నిలుపుకుంటోంది. రాష్ట్రంలో పెద్ద సామాజిక వర్గంగా ఉన్న లింగాయత్‌లు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎయిరిండియాలో ప్రీమియం ఎకానమీ సీట్లు

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా ఎంపిక చేసిన విమానాల్లో ప్రీమియం ఎకానమీ సీట్లనూ ఆఫర్‌ చేస్తోంది. విమానాల్లో ఫస్ట్‌క్లాస్‌, బిజినెస్‌, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ.. 4 కేబిన్‌ క్లాసులను అందించే తొలి, ఏకైక భారతీయ విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించింది. ప్రారంభ దశలో బోయింగ్‌ 777-200 ఎల్‌ఆర్‌ విమానాలు నడిచే మార్గాల్లో (బెంగళూరు-శాన్‌ఫ్రాన్సిస్కో, ముంబయి-శాన్‌ఫ్రాన్సిస్కో, ముంబయి-న్యూయార్క్‌) ప్రీమియం ఎకానమీ సీట్లు అందుబాటులో ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. NTR: భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్‌

భయమంటే ఎరుగని మృగాళ్లకు భయాన్ని పరిచయం చేసేందుకు రంగంలోకి దిగారు కథా నాయకుడు ఎన్టీఆర్‌ (NTR). ఇప్పుడాయన కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్‌’ లాంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయిక. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.  రూ.60 కోసం పదేళ్లు పోరాటం

దిల్లీకి చెందిన ఓ వ్యక్తి 60 రూపాయల కోసం పదేళ్ల పాటు న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించాడు. ఫిర్యాదుదారుడు కమల్‌ ఆనంద్‌ దక్షిణ దిల్లీలో నివాసం ఉండేవాడు. 2013లో సాకేత్‌ డిస్ట్రిక్ట్‌ సెంటర్‌లో ఉన్న ఓ మాల్‌లోని కోస్టా కాఫీ ఔట్‌లెట్‌లో కాఫీ తాగేందుకు తన భార్యతో కలిసి వెళ్లాడు. కాఫీ తాగితే పార్కింగ్‌ ఉచితం అని చెబుతూ అక్కడి ఉద్యోగి వారికి ఆఫర్‌ స్లిప్‌ ఇచ్చారు. దీంతో వారు కాఫీలు తాగి కారును పార్కింగ్‌ నుంచి బయటకు తీసేందుకు వెళ్లగా.. అక్కడి నిర్వాహకుడు రూ.60 పార్కింగ్‌ ఫీజు చెల్లించాలని కోరాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.  ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ధోని కెప్టెన్సీ పేలవంగా సాగిందని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ విమర్శలు గుప్పించాడు. ధోని పొరపాట్లు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని సెహ్వాగ్‌ తెలిపాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ తుషార్‌ దేశ్‌పాండేను ధోని ఉపయోగించిన విధానాన్ని సెహ్వాగ్‌ తప్పుబట్టాడు. ‘‘భారీగా పరుగులిచ్చిన తుషార్‌తో కాకుండా మొయిన్‌ అలీతో ధోని మధ్యలో ఒక ఓవర్‌ వేయించాల్సింది. ధోని తరుచుగా ఇలాంటి పొరపాట్లు చేస్తాడని ఆశించరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కొత్త నిబంధనలు

ఇళ్లు, అపార్టుమెంట్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను విధించింది. ముందస్తు సమాచారం లేకుండా.. ప్రజల్లో అవగాహన కల్పించకుండానే ఈ నిబంధనలను శనివారం నుంచే అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు, వాటిల్లోని అంశాలు, ఈసీ, లింక్‌ డాక్యుమెంట్లు తదితరాల ఆధారంగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్టాంపు డ్యూటీ చెల్లిస్తే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ షురూ

ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఎసైన్డ్‌, అభ్యంతరం లేని ఇతర ప్రభుత్వ స్థలాలు, అర్బన్‌ సీలింగ్‌ ల్యాండ్స్‌ను అధీనంలో పెట్టుకున్న వారికి, వివిధ సంస్థలకు నిబంధనల మేరకు వాటిపై హక్కులు బదిలీ చేయనున్నారు. 125 చదరపు గజాల లోపు స్థలాలకు పేదలకైతే ఉచితంగా, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణమైతే మార్కెట్‌ ధరకు ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మూడు నెలలు మండుడే..!

దేశంలో మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయి. దక్షిణ, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా చాలాచోట్ల ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలల మధ్య అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం ప్రకటించింది. ఈ మధ్యకాలంలో తూర్పు, మధ్య, వాయవ్య భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ప్రధానంగా బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి వేడిగాలులు వీచవచ్చని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పోర్న్‌స్టార్‌ వివాదంతో ట్రంప్‌పై కాసుల వర్షం

 లైంగిక వేధింపుల కేసు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాసుల వర్షం కురిపిస్తోంది. పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ వివాదంలో విచారణకు మన్‌హటన్‌ గ్రాండ్‌ జ్యూరీ విచారణకు అనుమతిచ్చిందన్న వార్త వెలువడిన 24 గంటల్లోనే ఆయనపై అభిమానుల్లో సానుభూతి పెరిగింది. విరాళాలు వెల్లువెత్తాయి. 2024 అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ మాజీ అధ్యక్షుడికి 24 గంటల్లోనే 4 మిలియన్‌ డాలర్ల (రూ.32.87కోట్లు)ను అభిమానులు పంపించారు. ఇందులో 25 శాతానికిపైగా చందాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు