Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Apr 2024 21:02 IST

1. అనపర్తి సీటుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించిన అనపర్తి అసెంబ్లీ స్థానం మార్పు ఉంటుందంటూ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనపర్తి సీటు భాజపాకు కేటాయించినా ఇంకా నిర్ణయం కాలేదని కొవ్వూరు ప్రజాగళం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి, నలుగురి పరిస్థితి విషమం

హైదరాబాద్‌ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట హైటెక్‌ బస్‌స్టాండ్‌ సమీపంలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. రెండేళ్ల చిన్నారి సహా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సాక్షులను కాపాడాలంటే అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలి: సీబీఐ

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ.. వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. బెదిరింపులు, ప్రలోభాల నుంచి దస్తగిరి, ఇతర సాక్షులను కాపాడాలంటే అవినాష్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోర్టును సీబీఐ కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైకాపా డీఎన్‌ఏలోనే శవరాజకీయం: చంద్రబాబు

జగన్‌ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైకాపా డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సిలబస్‌ మార్పు, కొత్త పాఠ్య పుస్తకాలపై NCERT కీలక ప్రకటన

కొత్త విద్యా సంవత్సరంలో సిలబస్‌ మార్పు, పాఠ్యపుస్తకాల విడుదలపై ఎన్‌సీఈఆర్టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) కీలక ప్రకటన చేసింది. 3, 6వ తరగతులకు మాత్రమే కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మూడో తరగతి పుస్తకాలు ఏప్రిల్‌ చివరివారంలో, ఆరో తరగతి పుస్తకాలను మే మధ్యకాలం నాటికి విడుదలవుతాయని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తొలి రోజు నుంచే ఐటీఆర్‌ ఫైలింగ్‌ షురూ.. 4 రోజుల్లో 23 వేల రిటర్నులు దాఖలు

గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించిన రిటర్నుల ఫైలింగ్‌ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఐటీఆర్‌ 1, 2, 4, 6 ఫారాలను ఇ-పైలింగ్‌ పోర్టల్‌లో ఏప్రిల్‌ ఒకటి నుంచే ఆదాయపు పన్ను శాఖ అందుబాటులో ఉంచింది. గత నాలుగు రోజుల్లోనే 23 వేల రిటర్నులు దాఖలయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చైనా మన భూభాగంలోకి చొచ్చుకొస్తే.. మోదీ నిద్రపోతున్నారు: ఖర్గే

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిన సమయంలో మోదీ నిద్రపోతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. లోక్‌సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!

1957 (రెండో సాధారణ) ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా పలు పోలింగ్‌ కేంద్రాల్లో వింత, హాస్యాస్పద సంఘటనలు జరిగాయి. ఓ జిల్లాకు చెందిన ఓటరు.. బ్యాలెట్‌ బాక్సును ‘ఆరాధ్య వస్తువుగా’ భావించి పూజలు చేశాడు. న్యూదిల్లీ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి.. నామినేషన్‌లో తనను తాను దైవంతో పోల్చుకున్నాడు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. బ్రిటన్‌ ప్రతిష్ఠాత్మక క్విజ్‌ ఫైనల్లో.. చంద్రయాన్‌-2 టీమ్ సభ్యుడు

యూకే ప్రతిష్ఠాత్మక క్విజ్‌ పోటీ ఫైనల్‌ రౌండ్‌లో అడుగుపెట్టాడు కోల్‌కతా కుర్రాడు సౌరజిత్‌ దేబ్‌నాథ్‌. ఎన్నో సంక్లిష్టమైన ప్రశ్నలకు టకటకా సమాధానం చెప్పి, తన బృందం ముందడుగు వేయడంలో కీలక పాత్ర పోషించారు. మన అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రాజెక్టు అయిన చంద్రయాన్‌-2 బృందంలో అతడొక సభ్యుడు కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పారిస్‌ ఒలింపిక్స్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుంటుంది : మెక్రాన్‌

ఈ ఏడాది జులైలో జరగనున్న ఒలింపిక్స్ వేడుకలకు పారిస్‌ సర్వం సిద్ధమవుతోంది. ఈక్రమంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పారిస్‌ ఒలింపిక్స్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుంటుందనడంలో తనకు ఎటువంటి సందేహం లేదన్నారు. ఇది తప్పుడు సమాచార వ్యాప్తితోపాటు మరేవిధంగానైనా ఉండవచ్చన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని